Allu Arjun: అల్లు అర్జున్ కేసులో భారీ ట్విస్ట్…క్షమాపణలు చెప్పిన సీపీ ఆనంద్!

Allu Arjun: అల్లు అర్జున్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి అయితే ఆదివారం ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నిన్న ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మీడియాపై ఈయన చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి నేషనల్ మీడియా మద్దతు ఇస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ఈ ఘటన గురించి సీవీ ఆనంద్.. మీడియాకు క్షమాపణలు చెప్పారు. నేషనల్ మీడియాను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ విషయం గురించి ఈయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. నేషనల్ మీడియాకి గతంలో భాగంగా నన్ను అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు తాను సహనం కోల్పోయానని తెలిపారు. అందుకే అలా మాట్లాడాల్సి వచ్చిందని ఈ విషయంలో తాను మీడియాకి క్షమాపణలు చెబుతున్నట్లు తెలియజేశారు.

ఇక అల్లు అర్జున్ ఘటన గురించి ఈయన మాట్లాడుతూ క్రౌడ్ ఎక్కువగా ఉందని పరిస్థితులు చేయి దాటిపోయాయి మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించినప్పటికీ అల్లు అర్జున్ మాత్రం సినిమా చూసిన తర్వాత తాను వెళ్తానని చెప్పినట్టు ఆనంద్ వెల్లడించారు. ఇలా కాసేపటికి రేవతి అనే అభిమాని మరణించిందని పరిస్థితులు కంట్రోల్ తప్పే అవకాశాలు ఉన్నాయి వెళ్లాలని తన మేనేజర్ ని కలిసి చెప్పినప్పటికీ మేనేజర్ మాత్రం అల్లు అర్జున్ వద్దకు మమ్మల్ని వెళ్ళనివ్వడం లేదని తెలిపారు.

15 నిమిషాల తర్వాత డిజిపి ఆదేశాలు మేరకు అల్లు అర్జున్ వద్దకు వెళ్లి ఈ విషయాన్ని వివరించగా ఆయన మాత్రం సినిమా చూసే వెళ్తానని చెప్పినట్టు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా ఆనంద్ వెల్లడించారు.