మరో బాలీవుడ్ స్టార్ హీరోని డైరెక్ట్ చేయబోతున్న అట్లీ.. దేశం గర్వించదగ్గ సినిమా అవుతుందంటూ కామెంట్స్!

షారుక్ ఖాన్ తో జవాన్ సినిమా తీసి పెద్ద హిట్ అందుకున్న సౌత్ ఇండియన్ డైరెక్టర్ అట్లీ. జవాన్ సినిమా దాదాపు 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడంతో దేశవ్యాప్తంగా అట్లీ పేరు మారు మ్రోగి పోయింది. దాంతో ఒక్కసారిగా అట్లీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఈ మధ్యనే బాలీవుడ్ లో బేబీ జాన్ సినిమాని ప్రొడ్యూస్ చేసి నిర్మాతగా కూడా మారాడు అట్లీ. ఈ సినిమాతోనే మహానటి కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ జరిగింది. జవాన్ తర్వాత డైరెక్టర్ గా చాలా గ్యాప్ తీసుకున్న అట్లీ ఇప్పుడు తాజాగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అప్డేట్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఏ 6 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని తెర కెక్కించబోతున్నారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ ప్రధాని పాత్రలో నటించబోతున్నారు. ప్రస్తుతం ఏ 6 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి.

ఈ సినిమా గురించి అట్లీ మాట్లాడుతూ ఏ 6 చిత్రానికి చాలా సమయం అవసరమవుతుంది, స్క్రిప్ట్ చివరి దశలో ఉంది, దేవుడు దయ వల్ల త్వరలోనే ఒక గుడ్ న్యూస్ ప్రకటిస్తాం అంతేకాకుండా మీరు అనుకున్నట్లుగానే ఆయనతో ( సల్మాన్ ఖాన్) రూపొందించే ఈ సినిమా ఖచ్చితంగా భారతదేశం గర్వించదగ్గ సినిమా అవుతుంది. ప్రస్తుతం పాత్రల ఎంపిక జరుగుతుంది.

మా ఈ ప్రయత్నానికి మీ ఆశీర్వచనాలు కావాలి అంటూ చెప్పుకోచ్చాడు అట్లీ. ఇక తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా ఒక చిత్రాన్ని నిర్మించబోతున్నాడు అట్లీ. బాలీవుడ్ కి చెందిన మురాద్ ఖేతని నిర్మాణ సంస్థతో తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తాడని సమాచారం. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఇతర నటీనటుల వివరాలు గానీ, సినిమాని ఎవరు డైరెక్ట్ చేస్తారు అనే విషయం కానీ వెల్లడించలేదు అట్లీ.