బాలయ్య షోలో తొడగొట్టిన వెంకీ మామ.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ఆహా టీం!

ఇద్దరు స్టార్ హీరోలని ఒకే ఫ్రేమ్లో చూడటం అనేది అభిమానులకి కన్నుల పండుగగా ఉంటుంది. అయితే చాలా తక్కువ సందర్భాల్లో అలా జరుగుతూ ఉంటుంది. అభిమానుల ఆకలి తీర్చేలా ఇద్దరు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్లో కనిపించబోతున్నారు. ఆ విశేషాలు ఏమిటో చూద్దాం. ఆహా ఓటీటీ లో వస్తున్న అన్ స్టాపుల్ షో కి బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇప్పటికే సక్సెస్ఫుల్గా మూడు సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పుడు నాలుగవ సీజన్ నడుస్తోంది. ఈ సీజన్లో ఇప్పటికే అల్లు అర్జున్, సూర్య, దుల్కర్ సల్మాన్, శ్రీలీల, నవీన్ పోలిశెట్టి వంటి వారు ఈ స్టేజి పై సందడి చేశారు. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ బాలయ్యతో కలిపి ఈ స్టేజ్ పై సందడి చేయబోతున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సంక్రాంతికి వెంకటేష్ టీం మన ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.

ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనుష్టాపబుల్ షో కి వచ్చాడు వెంకటేష్. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు ఆహా టీం. డిసెంబర్ 27 రాత్రి 7 గంటల నుంచి ఆహా ఓటీటీ లో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాబోతుంది అంటూ గ్లింమ్స్ ని రిలీజ్ చేశారు. ఇందులో బాలకృష్ణ స్టైల్ లో వెంకటేష్ తొడ కొడుతూ కనిపిస్తే మరోవైపు వెంకటేష్ స్టైల్ ని బాలకృష్ణ ఫాలో అవుతూ కనిపించారు. ఈ గ్లింప్స్ చూసిన ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేసాయి.

నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ మీద కామెంట్స్ చేస్తున్నారు ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు. అయితే ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్యన ఈ సంవత్సరం గట్టి పోటీ ఉండబోతుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో జనవరి 14న వెంకటేష్ థియేటర్లలోకి వస్తుంటే డాకు మహారాజుగా జనవరి 12న థియేటర్లలోకి రాబోతున్నాడు బాలకృష్ణ. అప్పుడు చూడాలి ఫ్యాన్ వార్ ఎలా ఉంటుందో.

Unstoppable with NBK S4 | Episode 7 Glimpse | Nandamuri Balakrishna, Venkatesh | ahaVideoIN