Tollywood: సినిమా ఇండస్ట్రీ విషయంలో ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి కొన్ని కీలక నిర్ణయాలను సినిమా ఇండస్ట్రీ మొత్తం తప్పు పట్టడమే కాకుండా పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి ఓటమికి కూడా సినీ ఇండస్ట్రీ కారణమని చెప్పాలి. పేదలకు అందుబాటులో ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి టికెట్ ధరలను తగ్గిస్తూ చట్టాన్ని తీసుకువచ్చారు. అయితే ఈ విషయం దర్శక నిర్మాతలకు సినిమా సెలబ్రిటీలకు ఏమాత్రం మింగుడం పడలేదు దీంతో జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపించారు.
ప్రజల క్షేమాన్ని వారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సినిమా టికెట్ల రేట్లు తగ్గించడమే కాకుండా అదనపు షోలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. దీంతో చిత్ర పరిశ్రమపై జగన్ కక్ష కట్టారని ఎంతోమంది జగన్మోహన్ రెడ్డిని పూర్తిస్థాయిలో విమర్శించారు. ఇక జగన్మోహన్ రెడ్డి ఓటమిపాలు కావడంతో వారి మనసులో ఉన్న ద్వేషం మొత్తం బయటకు పెట్టారు. ఇక వారికి అనుకూల పార్టీలు అధికారంలోకి రావడంతో నిర్మాతలు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు ఇష్టానుగుణంగా సినిమా టికెట్లను పెంచేసుకున్నారు.
ఇక ఇటీవల వచ్చిన పుష్ప టు సినిమా విషయంలో కూడా సినిమా టికెట్ల రేట్లు పెంచడం రెండు తెలుగు రాష్ట్రాలలో బెనిఫిట్ షోలకు పరిమితులు ఇవ్వడం అనేది జరిగింది. అయితే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా జరిగినటువంటి ఈ వివాదం ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలోనూ రాజకీయాలలో కూడా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
ఇలా ఈ ఘటన విషయంలో రేవంత్ రెడ్డి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు తాను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు తెలంగాణలో ఎలాంటి బెనిఫిట్ షోలకు అనుమతి లేదని అలాగే సినిమా టికెట్ల రేట్లు కూడా పెంచనని ఈయన తన నిర్ణయాన్ని ప్రకటించారు అయితే ఈ నిర్ణయం పట్ల సినిమా ఇండస్ట్రీ ఎదురు చెప్పలేదు కేవలం మౌనం మాత్రమే పాటిస్తున్నారు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన నోర్లు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నాయి అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. నాడు జగన్ చేసింది తప్పైతే ఇప్పుడు రేవంత్ చేసింది రైటా అంటూ కామెంట్లు చేస్తున్నారు. నిర్మాతల లాభాల కోసం ఇలా సినిమా టికెట్లు రేట్లు బెనిఫిట్ షోలను వేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఈ విషయంలో గతంలో జగన్ ఇప్పుడు రేవంత్ తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అని కామెంట్లు చేస్తున్నారు.