నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కొన్నాళ్ళుగా సినీ నిర్మాణం విషయమై స్తబ్దుగా వున్నాడు. కొన్ని కారణాల వల్ల పవన్ కళ్యాణ్‌తో సినిమా వర్కవుట్ అవలేదుగానీ, అయి వుంటే.. ఇప్పుడా సినిమా పనుల్లో బండ్ల గణేష్ బిజీగా వుండేవాడే.
అసలు విషయంలోకి వస్తే, ఓ యంగ్ హీరో డేట్స్ సంపాదించిన బండ్ల గణేష్, దర్శకుడి కోసం వెతుకుతున్నాడట. అతనికి హరీష్ శంకర్ రూపంలో బెస్ట్ ఆప్షన్ కనిపించిందన్నది తాజా ఖబర్.
అయితే, రవితేజతో ఓ సినిమాని పట్టాలెక్కించే ఆలోచనలో వున్నాడు హరీష్ శంకర్. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సంగతేంటి మరి.? అంటే, అదంతే. వున్నా, లేనట్టే.! ఈ నేపథ్యంలోనే, హరీష్ శంకర్‌ని తనవైపుకు తిప్పుకోవాలని బండ్ల గణేష్ అనుకుంటున్నాడట.
అయితే, ఏ హీరో డేట్స్ బండ్ల గణేష్ తీసుకుని రెడీగా వున్నాడన్నదానిపై స్పష్టత రావాల్సి వుంది. ఏం చేసినా, పవన్ కళ్యాణ్‌కి చెప్పే చేయాలనుకుంటున్నాడట బండ్ల. కాకపోతే, ముందుగా అన్నీ సిద్ధం చేసుకుని, ఆ తర్వాత ‘దేవర’ పవన్ కళ్యాణ్‌కి చెబుతాడట.