హరీష్ శంకర్ వెంట పడుతున్న బండ్ల గణేష్.!

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కొన్నాళ్ళుగా సినీ నిర్మాణం విషయమై స్తబ్దుగా వున్నాడు. కొన్ని కారణాల వల్ల పవన్ కళ్యాణ్‌తో సినిమా వర్కవుట్ అవలేదుగానీ, అయి వుంటే.. ఇప్పుడా సినిమా పనుల్లో బండ్ల గణేష్ బిజీగా వుండేవాడే.

అసలు విషయంలోకి వస్తే, ఓ యంగ్ హీరో డేట్స్ సంపాదించిన బండ్ల గణేష్, దర్శకుడి కోసం వెతుకుతున్నాడట. అతనికి హరీష్ శంకర్ రూపంలో బెస్ట్ ఆప్షన్ కనిపించిందన్నది తాజా ఖబర్.

అయితే, రవితేజతో ఓ సినిమాని పట్టాలెక్కించే ఆలోచనలో వున్నాడు హరీష్ శంకర్. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సంగతేంటి మరి.? అంటే, అదంతే. వున్నా, లేనట్టే.! ఈ నేపథ్యంలోనే, హరీష్ శంకర్‌ని తనవైపుకు తిప్పుకోవాలని బండ్ల గణేష్ అనుకుంటున్నాడట.

అయితే, ఏ హీరో డేట్స్ బండ్ల గణేష్ తీసుకుని రెడీగా వున్నాడన్నదానిపై స్పష్టత రావాల్సి వుంది. ఏం చేసినా, పవన్ కళ్యాణ్‌కి చెప్పే చేయాలనుకుంటున్నాడట బండ్ల. కాకపోతే, ముందుగా అన్నీ సిద్ధం చేసుకుని, ఆ తర్వాత ‘దేవర’ పవన్ కళ్యాణ్‌కి చెబుతాడట.