ఒకానొక సమయంలో పవన్ పెళ్లిల్ల వ్యవహారం ఏపీ రాజకీయాల్లో తెగ రచ్చ రచ్చ అయ్యేది. ఆఖరికి అసెంబ్లీలో సైతం ఆటైపు కామెంట్లు వచ్చాయి. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం ఈ విషయాన్ని తెగ వైరల్ చేసేవారు. పెళ్లిల్లపై పవన్ కు చిన్నచూపు అంటూ అల్లరి చేశారు. ఈ సమయంలో పవన్ గట్టిగానే రియాక్ట్ అయ్యారు కానీ… ఆ క్షణంలో మాట తూలారు.
తన పెళ్లిల్లపై కామెంట్ చేస్తున్న వైసీపీ నేతలకు గతంలో పవన్ గట్టిగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సెట్ అవ్వలేదు అధికారికంగా విడాకులు తీసుకున్నాను అని చెప్పారు. అక్కడితో ఆగకుండా.. మీరు కూడా చేసుకోండి, మీలా ఒక్కరిని చేసుకుని పదిమందితో తిరగడం లేదు అంటూ టంగ్ స్లిప్ అయ్యారు. దీంతో… ఆ పది మందినీ వైసీపీ నేతల దగ్గరకు తమరే పంపారా అంటూ పేర్ని నాని గట్టిగా ఇచ్చిపడేశారు.
అనంతరం కొంతకాలం పాటు ఆ టాపిక్ తగ్గింది. అయితే వారాహి యాత్రలో ఈ మధ్య పవన్ శృతిమించి విమర్శలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ క్రమంలో తాజాగా మైకందుకున్న జగన్… ప్రతీ నాలుగేళ్లకు భార్యలను మారుస్తాడంటూ పవన్ పై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు.. దీంతో మరో సారి ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. దీంతో.. ముఖ్యమంత్రే మొదలుపెట్టారు ఇంక ఆలస్యం ఎందుకు అనుకున్నారో ఏమో కానీ.. మంత్రులు అందుకున్నారు.
ఇందులో భాగంగా పవన్ పై సెటైర్స్ వేసే విషయంలో ఫస్ట్ లైన్ లో ఉండే అంబటి రాంబాబు తాజాగా కీబోర్డుకు పనిచెప్పారు. పవన్ పై ఊహించని రీతిలో సెటైర్ వేశారు.
పవన్ కళ్యాణ్
పవన్ + కళ్యాణ్
పవన్ = గాలి, గాలి, గాలి
కళ్యాణ్ = కళ్యాణాలు
సార్థక నామధేయుడు !
అంటూ అంబటి వేసిన ట్వీట్. ఈ ట్వీట్ మరోసారి కలకలం రేపింది. సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. ఇప్పటికే జగన్ వేసిన కౌంటర్లతో మంటెక్కిపోతున్న జనసైనికుల పుండుపై అంబటి ఇలా మరోసారి కారం చల్లారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి భీమవరం సభలో పవన్… జగన్ వ్యాఖ్యలపైనా, అంబటి ట్వీట్లపైనా ఎలా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాలి.