YS Jagan: వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఎన్నో కష్టాలు చుట్టుముట్టాయని చెప్పాలి. గత ఎన్నికలలో పార్టీ ఘోరంగా ఓటమిపాలు అయింది అయితే గత ఐదు సంవత్సరాల కాలంలో వైసిపి చేసిన తప్పులను కూటమి ప్రభుత్వ లోతుగా విచారణ జరిపి బయటకు వెలికితీస్తున్న నేపథ్యంలో ఎంతో మంది కీలక నేతలు పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. ఈ విషయం జగన్ ను ఊపిరాడనివ్వకుండా చేస్తుంది.
మరోవైపు జగన్మోహన్ రెడ్డికి సొంత కుటుంబం నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. ఇలా ఒకవైపు కుటుంబ విషయాలు మరోవైపు పార్టీ వ్యవహారాలను చక్క పెట్టటంలో జగన్ సతమతమవుతున్నారని తెలుస్తుంది. ఇలాంటి తరుణంలోనే కొన్ని సందర్భాలలో జగన్ తన సొంత కుటుంబ సభ్యులపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. అయితే తాజాగా వైఎస్ అవినాష్ రెడ్డి పై జగన్ సీరియస్ అయ్యారని తెలుస్తుంది.
గత కొన్ని దశాబ్దాలుగా కడప అంటేనే వైయస్ ఫ్యామిలీకి కంచు కోట లాగా ఉంది అలాంటిది ఇప్పుడు కుటుంబానికి ఎంతో మంది దూరం అవ్వడమే కాకుండా ఆ కంచు కోటను బద్దలు కొడుతున్నారని తెలుస్తోంది. కడప జిల్లాలో మొత్తం 203 నీటి సంఘాలు ఉండగా, అందులో 202 సంఘాలు కూటమి ఏకగ్రీవంగా గెలుచుకుంది.
పులివెందుల నియోజకవర్గంలో 32 సంఘాలను సైకిల్ పార్టీ ఏకగ్రీవంగా దక్కించుకుంది. ఇక అసలు విషయానికొద్దాం. ఈ క్రమంలో కడప కార్పొరేషన్‌పై కన్నేసింది టీడీపీ. దానికి వెనుక నుంచి చకచకా పావులు కదుపుతున్నారు బీటెక్ రవి.
కడప జిల్లాలో వైసీపీ కార్పొరేటర్లు 11 మంది తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు మరి కొంతమంది కూడా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయం తెలిసిన జగన్ వైఎస్ అవినాష్ రెడ్డికి ఫోన్ చేసి ఇలా వైసిపి కార్పొరేటర్స్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్తుంటే ఆపకుండా ఏం చేస్తున్నారు అంటూ మండిపడినట్లు తెలుస్తోంది.ఎవరూ పార్టీని వీడకుండా చూడాలని కాసింత గట్టిగానే చెప్పాడట. ఇంత జరుగుతున్నా.. ఇన్నాళ్లు ఏం చేస్తున్నావని మందలించారట. ఇలా వైయస్ జగన్ మందలించడంతో వైయస్ అవినాష్ కూడా కోపంగానే ఉన్నారని తెలుస్తోంది.