భగవంతుడిని పూజించే సమయంలో పొరపాటున కూడా ఈ పువ్వులు వాడకూడదు?

సాధారణంగా మనం భగవంతుడిని పూజించే సమయంలో మనకు తోచిన పుష్పాలతో స్వామివారికి అలంకరించి పూజ చేస్తుంటాము. ఇలా మనకు పరిసర ప్రాంతాలలో లభించే పుష్పాలతో పూజ చేసి ఆ దేవుడు చల్లని కృప మనపై ఉండాలని భగవంతుని కోరుకుంటాము. అయితే ఒక్కో రోజు ఒక్కో దేవుడిని పూజించడం మనం చేస్తుంటాము.సోమవారం శివుడి ఆలయానికి వెళ్లి పూజ చేయగా మంగళవారం అమ్మవారికి పూజ చేస్తాము అలాగే బుధవారం వినాయకుడిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటాము.

ఈ విధంగా ఒక్కో రోజు ఒక్కో దేవుడికి ప్రత్యేక పూజలను చేస్తుంటారు. అయితే కొన్ని రకాల పుష్పాలతో కొందరి దేవుళ్ళను పూజించడం వల్ల స్వామివార కరుణ కటాక్షాలు కాకుండా వారి ఆగ్రహం మనపై ఉంటుందని పండితులు చెబుతున్నారు. మరి ఏ దేవుడికి ఏ పుష్పాలతో పూజ చేయకూడదు అనే విషయానికి వస్తే. శ్రీహరికి తులసిమాలతో పూజ చేయడం ఎంతో ప్రీతికరం అలాగే పొరపాటున కూడా అగస్త్య పూలను వాడుకూడదని పండితులు చెబుతున్నారు.

శ్రీరామచంద్రుడిని పూజించే సమయంలో పొరపాటున కూడా గన్నేరు పువ్వులను ఉపయోగించకూడదు గన్నేరు పూలు శ్రీరామునికి ఆగ్రహాన్ని తెప్పిస్తాయి. అలాగే గన్నేరు పుష్పాలతో దుర్గామాతకు కూడా పూజ చేయకూడదు.ఇక పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన దతురా మందార పుష్పాలు పార్వతి దేవికి అసలు నచ్చవు కనుక కేవలం శివలింగానికి మాత్రమే వీటితో పూజ చేయాలి. ఇక మనం దేవుళ్లను పూజించే సమయంలో నేలరాలిన, చెడు వాసన కలిగిన పుష్పాలు,రేకులు రాలిన పుష్పాలతో పూజ చేయకూడదు ఇలాంటి పుష్పాలతో పూజ చేసిన ఆ పూజకు ఫలితం ఉండదు.