HIT The 3rd Case: మే 1న సినిమా ఇండస్ట్రీల ఆశలు.. హిట్-3 పై టాలీవుడ్ టార్గెట్!

ఈ వేసవిలో సినిమా థియేటర్లకు వెసులుబాటు లేకుండా పోతుంది. ప్రేక్షకులు తక్కువగా రావడంతో టాలీవుడ్‌ సహా ఇతర ఇండస్ట్రీలు కూడా నిరాశలో ఉన్నాయి. ఇటీవల విడుదలైన ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’, ‘ఓదెల-2’ వంటి సినిమాలు కొద్దిసేపు ఆకట్టుకున్నా, దూకుడు కొనసాగించలేకపోయాయి. ఈ వారం ‘సారంగపాణి జాతకం’, ‘చౌర్యపాఠం’ లాంటి చిన్న సినిమాలు మాత్రమే ఉండటంతో పెద్దగా హోప్స్ లేవు.

అయితే మే 1న రాబోతున్న నాని ‘హిట్-3’ మాత్రం పరిస్థితిని మార్చే సినిమాగా టాలీవుడ్ ఆశలు పెట్టుకుంది. నాని గత చిత్రాలు సరిపోదా శనివారం, దసరా, హాయ్ నన్న హిట్ కావడంతో ఈ సారి మరింత మాస్ అండ్ థ్రిల్లింగ్ కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్లాన్‌లో ఉన్నాడు. డైరెక్టర్ శైలేష్ కొలను క్రైమ్ యూనివర్స్‌లో ఇది మరో హై వోల్టేజ్ సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్లకు ఇది రివైవల్ లాంటి ఆశ చూపుతోంది.

కేవలం టాలీవుడ్‌నే కాదు.. కోలీవుడ్‌, బాలీవుడ్‌ ఇండస్ట్రీలకు కూడా ఇదే రోజు కీలకంగా మారింది. సూర్య నటించిన ‘రెట్రో’ కూడా అదే రోజు విడుదల కాబోతుండటం ఆసక్తికరం. ఈ సినిమా సూర్యకు కమర్షియల్ కమ్ బ్యాక్ ఇచ్చే అవకాశంగా కనిపిస్తోంది. తెలుగులో కూడా ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్ విడుదల కాబోతుండటంతో మల్టీ స్టేట్ హోప్స్ కనిపిస్తున్నాయి.

బాలీవుడ్‌లో అజయ్ దేవగణ్ ‘రైడ్-2’ రిలీజ్ కోసం రెడీగా ఉండగా, మొదటి భాగం సక్సెస్ కావడం వల్ల దీని మీద ఇండస్ట్రీ అంతా ఫోకస్ పెట్టింది. ఒకేసారి మూడు ప్రధాన పరిశ్రమల నుంచి భారీ అంచనాల సినిమాలు రావడం అరుదే. మే 1 రిలీజ్ డే ఇండియన్ బాక్సాఫీస్‌కు కొత్త ఊపునిస్తే ఆశ్చర్యం లేదు. టికెట్ కౌంటర్లకు జనం తిరిగి వచ్చే చాన్స్ కూడా ఉందనే నమ్మకంతో ఇండస్ట్రీలు ఎదురు చూస్తున్నాయి.

సింగర్ సునీత ఫేక్ || Pravasthi Sensational Video on Singer Sunitha Comments || PaduthaTheeyaga || TR