మన హిందూ సాంప్రదాయంలో పూజా కార్యక్రమాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతిరోజు ప్రజలందరూ తమ ఇష్ట దైవాన్ని ఆరాధిస్తూ ఉంటారు. ఇక సోమవారం రోజున భక్తులందరూ మహా శివుడిని పూజిస్తూ ఉంటారు. ఇలా ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్లి శివుడి దర్శనం చేసుకుంటారు. అయితే శివాలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ శివున్ని దర్శించుకునేటప్పుడు భక్తులందరూ కూడా కొన్ని నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. శివాలయానికి వెళ్ళినప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
*శివాలయానికి వెళ్లిన భక్తులు ఆలయ గోపురం దర్శించగానే మనసులో పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ రెండు చేతులు జోడించి మన మనసుని శివరాధనకై లీనం చేయాలి.
*అయితే మహిళలు ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా జుట్టు విరబోసుకోకుండా ముడి వేసుకొని వెళ్లాలి.
*ఆలయంలోకి వెళ్ళిన తర్వాత మొదట వినాయకుడిని దర్శించి వినాయక స్తుతి చెప్పి గణపతి ముందు గుంజీల్లో తీయాలి.
*ఆలయం చుట్టూ కేవలం మూడు ప్రదక్షణలు మాత్రమే చేయాలి.
*ఇక గర్భగుడిలోకి అడుగుపెట్టిన తర్వాత మొదట నందీశ్వరుడికి నమస్కారం చేయాలి. ఆ తరువాత నందీస్వరుడి కొమ్ముల నుండి శివుని దర్శనం చేసుకోవాలి .
*ఇక శివున్ని దర్శించుకుని గర్భగుడి నుండి బయటికి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితులలోను ధ్వజస్తంభానికి నమస్కరించకూడదు.
* ఇలా శివుని దర్శించుకున్న తర్వాత ధ్వజస్తంభాన్ని నమస్కరించటం వల్ల శివుడిని దర్శించుకున్న పుణ్యఫలం లభించదు.