గుడి దగ్గరలో ఇల్లు నిర్మిస్తే ఎలాంటి పరిణామాలు జరుగుతాయి..ఒకవేళ కట్టుకుంటే ఎంత దూరం పాటించాలో తెలుసా..?

సాధారణంగా గుడికి దగ్గరలో ఇల్లు నిర్మించకూడదని మన పెద్దలు చెబుతూ. ఎందుకంటే గుడి నీడ మన ఇంటి పై పడటం వల్ల అనేక చెడు పరిణామాలు చోటు చేసుకుంటాయని పండితులు చెబుతున్నారు. అందువల్ల పూర్వకాలంలో గర్భగుడి చుట్టూ రెండు మూడు ప్రహరీ గోడ లు కట్టేవారు. అసలు గుడికి దగ్గరలో ఇల్లు కట్టుకోవచ్చా? ఒకవేళ కట్టుకుంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

హిందూ పురాణాల ప్రకారం గుడి దగ్గరలో ఇల్లు కట్టుకోవడం వల్ల కొన్ని మంచి చెడు, ప్రభావాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం గుడి బయట ఉండే ధ్వజస్తంభం నీడ ఇంటిపై పడకూడదు. అలాగే స్తంభానికి ఎదురుగా కూడా ఇంటిని నిర్మించకూడదు. ముఖ్యంగా శివాలయానికి, అమ్మవారి ఆలయాలకు, గ్రామ దేవతల ఆలయాలకు దగ్గరలో ఎండిన నిర్మించకూడదు. ఒకవేళ తప్పక ఇంటిని నిర్మించాలనుకున్న కూడా గుడికి వంద అడుగుల దూరంలో ఇంటిని నిర్మించాలి. ఎందుకంటే శివుడి చూపు ఎల్లప్పుడూ మీ ఇంటిపై ఉండటం మంచిది కాదని పండితులు చెబుతున్నారు.

అలాగే పురాణాల ప్రకారం విష్ణు ఆలయానికి దగ్గరలో ఇల్లు కట్టుకోవాలని భావించేవారు ఆలయానికి కనీసం 30 అడుగుల దూరంలో ఇంటిని నిర్మించుకోవడం మంచిది. అలాగే కొన్ని శక్తి ఆలయాలకు దగ్గరలో కూడా ఇల్లు నిర్మించడం వల్ల ఇంట్లో చెడుపరిణామాలు చోటు. అందువల్ల చెడు ఆలయాలకి దగ్గర్లో ఇంటిని నిర్మించాలనుకునేవారు కనీసం 120 అడుగుల దూరంలో ఇంటిని నిర్మించుకోవటం మంచిది. అలాగే మిగిలిన దేవుడి ఆలయాల చుట్టూ ఇంటిని నిర్మించుకునే వారు కనీసం 100 అడుగుల దూరంలో ఇంటిని నిర్మించుకోవడం మంచిది. లేదా కుటుంబంలో తరచూ అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇంటిని నిర్మించుకున్న తర్వాత ఆలయం నీడ మన ఇంటిపై పడకుండా ఉండేలా చూసుకోవాలి.