శివాలయంలో ప్రదక్షిణలు చేస్తున్నారా… ఈ నియమాలను పాటించాలని మీకు తెలుసా?

సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్తే ఆలయంలోకి వెళ్ళిన వెంటనే ముందుగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన అనంతరం గుడి లోపలికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటాము.ఇలా మనం వెళ్లిన ప్రతి ఒక్క ఆలయంలో కూడా మనం ఇలాగే ప్రదక్షిణాలు చేస్తాం కానీ పరమేశ్వరుడి ఆలయానికి వెళ్ళిన వారు మాత్రం ప్రదక్షిణలు చేసే సమయంలో కొన్ని నియమాలను పాటించి స్వామివారికి ప్రదక్షణలు చేయాలని పురాణాలు చెబుతున్నాయి.మరి శివాలయానికి వెళ్లిన సమయంలో మనం ప్రదక్షిణలు ఎలా చేయాలి అనే విషయాన్ని వస్తే…

శివాలయంలో ధ్వజస్తంభం నుంచి ప్రదక్షిణ ప్రారంభించి చండీశ్వరుని వరకు వెళ్లి.. అక్కడ చండీశ్వరుని దర్శించుకొని తిరిగి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరకు చేరుకోవాలి.ఇలా ధ్వజస్తంభం దగ్గరకు రాగానే ఒక్క నిమిషం పాటు ఆగి అనంతరం మరల ప్రదక్షణ చేయడం మొదలు పెట్టాలి.సోమసూత్రం అభిషేక జలం వెళ్లే దారి వరకూ అక్కడ నుంచి తిరిగి మళ్ళీ నందీశ్వరుని చేరుకుంటే ఒక శివ ప్రదక్షిణ పూర్తి చేసినట్లవుంటుంది. ఈ విధం చేసే ప్రదక్షిణ చండి ప్రదక్షిణ లేదా సోమసూత్ర ప్రదక్షిణ అని అంటారు.

ఇలా ప్రదక్షిణ చేసే సమయంలో సోమసూత్రాన్ని దాటి వెళ్ళకూడదు. సోమసూత్రం నుంచి ఆలయంలో చేసిన అభిషేకం జలం బయటకు వెళ్తుంది. అందుకే సోమసూత్రాన్ని దాటి వెళ్లకూడదని చెబుతారు. అదేవిధంగా అక్కడ శివ ప్రమధగణాలు ఉంటారని విశ్వాసం. ఈ జలం దాటి చేసే ప్రదక్షిణ చేయటం వల్ల ఆ శివుడి అనుగ్రహం మనపై ఎట్టి పరిస్థితులలో ఉండదని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని శివుడి ఆలయంలో ప్రదక్షిణలు చేయాలి.