భారతదేశ వ్యాప్తంగా ఉండే హిందువులు ఎక్కువ శాతం మంది కొలిచే దేవుళ్ళలో శ్రీరాముడు కూడా ఒకరు. హిందూ మతంలో శ్రీ రాముడి పట్ల ప్రజలకు అచంచలమైన విశ్వాసం, భక్తి ఉంటుంది. మామూలు రోజుల్లో శ్రీరామునికి పూజలు చేస్తూ ఉంటారు. ఇకపోతే శ్రీ రామ నవమి పండుగ శ్రీరామునికి అంకితం చేయబడింది. ఈ పండుగను శ్రీరాముని జన్మదినోత్సవంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలోని శుక్ల పక్షం తొమ్మిదో తేదీన పవిత్రమైన రామ నవమిని జరుపుకుంటారు. రాముని అనుగ్రహం పొందడానికి భక్తులు రామ నవమి నాడు రాముడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సంవత్సరం 2024 లో శ్రీ రామ నవమి ఏప్రిల్ 17 న జరుపుకోనున్నారు.
శ్రీ రాముడిని ఆరాధించడం ద్వారా మనిషి జీవితంలోని అన్ని బాధలు, కష్టాలు, నష్టాలు శాశ్వతంగా తొలగిపోతాయని శ్రీరాముడి అనుగ్రహం కూడా లభిస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా ఈ శ్రీరామనవమి పండుగ రోజున సీతారాముల వారి కళ్యాణం చేస్తూ ఉంటారు. అయితే ఆర్థికపరమైన సమస్యలు తొలగి తన లాభం కోసం చూస్తున్నవారు ఈ శ్రీరామనవమి పండుగ రోజు సాయంత్రం కొన్ని రకాల పనులు చేస్తే చాలు. ఆ శ్రీరాముడి అనుగ్రహం కలుగుతుంది..ఆర్థిక లాభం కోసం, రామ నవమి సాయంత్రం ఒక గిన్నెలో నీటిని తీసుకుని రామరక్షా మంత్రాన్ని ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీం నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. తర్వాత ఈ పవిత్ర జలాన్ని ఇంటి నలుమూలల్లో చళ్ళితే మీకున్న ఆర్థికపరమైన సమస్యలు ఇబ్బందులు అని తొలగిపోతాయి.
అలాగే సంతానం కోసం చూస్తున్నవారు కొబ్బరికాయను తీసుకుని ఎర్రటి గుడ్డలో చుట్టి సీతాదేవికి సమర్పించి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అలాగే కోటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు.. కోర్టు ముందు నెయ్యి లేదా నూనె దీపం వెలిగించి శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ అని 108 సార్లు జపించాలి. వివాహంలో అడ్డంకులను తొలగిపోవడానికీ.. శ్రీ రామ నవమి రోజు సాయంత్రం సీతారాములకు పసుపు, కుంకుమ, గంధాన్ని సమర్పించి ఓం జై సీతా రామ్ అని 108 సార్లు జపించాలి. శ్రీరామ పండుగ రోజున మద్యం సేవించడం మాంసం తినడం లాంటివి అస్సలు చేయకూడదు.