ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా కూడా మన పూర్వీకుల అందించిన శాస్త్రాలకు ఇప్పటికీ ప్రాముఖ్యతను ఇస్తున్నారు. ఈ క్రమంలో మన ఇంట్లో కాని, ఆఫీస్ లో కానీ ఉండే వస్తువులను వాస్తు శాస్త్ర ప్రకారం ఉంచుకోవడం వల్ల సుఖ సంతోషాలు చేసురుతయని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తన్నారు. ఈ క్రమంలో చాలామంది ఇంట్లో లాఫింగ్ బుద్ధా విగ్రహాన్ని ఉంచుకుంటారు. అలాగే కోరికలు తీర్చే విశ్వ గోవు అయిన కామధేను విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. హిందూ ధర్మ ప్రచార గోమాతను లక్ష్మి స్వరూపంగా భావిస్తారు. గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారని మన పురాణాలలో ఉంది. గోమాతను పూజిస్తే సకల దోషాలు పరిహారం అవుతాయని నమ్మకం.
అందువల్ల గోమాత విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇబ్బందులు తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని నమ్మకం. అయితే ఈ కామధేను ఆవు మరియు దూడ విగ్రహాన్ని మీ ఇంట్లో ఈశాన్య దిశలో ఉంచాలి. ఈశాన్య దిశలో బరువైన వస్తువులు పెట్టకూడదని అంటారు ..కానీ హిందూ విశ్వాసాల ప్రకారం ఈశాన్యం దేవతల కోసం ప్రత్యేకించబడిన పవిత్ర స్థలం. అందువల్ల ఈశాన్య దిశలో కామధేను ఆవు విగ్రహాన్ని ఉంచడం వల్ల శుభ ఫలితాలు చేకూరుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
అయితే ఎటువంటి కామధేను విగ్రహాన్ని ఉంచాలని చాలామందికి అనుమానం ఉంటుంది. వెండి,ఇత్తడి, రాగి , పాలరాయి వంటి ఈ విగ్రహం అయిన ఈశాన్య దిశలో ఉంచటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కామధేను విగ్రహం ఇంట్లో సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. అయితే ఇంట్లోనే కాకుండా ఆఫీస్ లో కూడా ఈ విగ్రహాన్ని ఈశాన్య దిశలో ఉంచటం వల్ల శుభఫలితాలు చేకూరుతాయి. అంతే కాకుండా పూజ గదిలో కూడా కామధేను విగ్రహాన్ని ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల ప్రభావం చూపిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో కామధేను విగ్రహం లేని వారు వెంటనే ఈ విగ్రహాన్ని మీ ఇంట్లో ఉంచుకొని శుభ ఫలితాలు చూడండి.