దీపారాధన చేసే సమయంలో ఈ పొరపాట్లు చేస్తున్నారా .. జాగ్రత్త?

సాధారణంగా ప్రతిరోజు మనం చేసే పనులలో ఎలాంటి ఆటంకాలు లేకుండా దైవబలం మనతో పాటు ఉండాలని భావించి ప్రతిరోజు ఉదయమే భగవంతుడిని స్మరించుకుంటూ ఇంట్లో దీపారాధన చేయడం సర్వసాధారణం. ఇలా ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తూ భగవంతుడిని స్మరించుకుంటూ ఉంటారు.అయితే దీపారాధన చేసే సమయంలో తప్పనిసరిగా మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాము. ఇలాంటి పొరపాట్లు చేయడం వల్ల భగవంతుడి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది.

ఈ క్రమంలోనే దీపారాధన చేసే సమయంలో కొన్ని నియమాలను పాటిస్తూ పొరపాట్లు జరగకుండా పూజించడం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తవని పండితులు చెబుతున్నారు. మరిదీపారాధన చేసే సమయంలో ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఉండాలి ఎలాంటి నియమాలను పాటించాలి అనే విషయానికి వస్తే… సాధారణంగా మనం తూర్పు వైపు తిరిగి దేవుడి ముఖచిత్రాలు పడమర వైపు ఉండేలా పూజిస్తాము. అయితే మనం దీపారాధన చేసే సమయంలో దీపాలను నేరుగా వెలగించకుండా కొద్దిగా ఆగ్నేయ మూల వైపు దీపపు కుందేలను ఉంచి వెలిగించాలి.

ఇక చాలామంది ఒకే ఒత్తి వేసే దీపాలను వెలిగిస్తారు. అలా కాకుండా ఒకవైపు మూడు మరోవైపు రెండు వత్తులను వేసి దీపారాధన చేయడం మంచిది.ఇక చాలామంది చమురుతో దీపారాధన చేస్తుంటారు. చమరకు బదులు నువ్వుల నూనె లేదా ఆవనూనెతో దీపారాధన చేయడం శుభప్రదం. ఇక పూజ అనంతరం కర్పూర హారతి ఇవ్వడం వల్ల ఏ విధమైనటువంటి దుష్టశక్తులు, మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మనపై ప్రభావం చూపకుండా బయటకు వెళ్లిపోతాయని పండితులు చెబుతున్నారు.