శని దేవుడు నలుపు రంగులో ఉండి వస్తువులను ఇష్టపడటానికి కారణం ఇదేనా?

నవగ్రహాలలో ఒకరిగా శని దేవుడు పూజింపబడుతున్నాడు. ఇక నవగ్రహాలలో శని దేవుడిని కర్మను ప్రసాదించే దేవుడిగా భావిస్తారు. శని ఎవరిపై అనవసరంగా తన ప్రభావం చూపించరని ఎవరి కర్మకు తగ్గ ఫలితాన్ని వారికి అందిస్తూ ఉంటారు. అయితే ఒకసారి శని ప్రభావం మన పై పడింది అంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక శని దేవుడు నలుపు రంగులో ఉండి ఆయన స్వభావం ఎంతో కోపంగా ఉంటుందని చెబుతుంటారు.ఇక శని ప్రభావం మనపై ఉన్నప్పుడు పరిహారం చేసుకోవడానికి నలుపు రంగు వస్తువులను ఎక్కువగా వాడుతూ ఉంటారు. శని దేవుడికి కూడా నలుపు రంగు వస్తువులను సమర్పిస్తూ పూజిస్తారు.అయితే శని దేవుడు నలుపు రంగులో ఉండడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే…

పురాణాల ప్రకారం సూర్య భగవానుడు దక్ష ప్రజాపతి కుమార్తె సంధ్యను వివాహం చేసుకున్నారు. వీరికి యమునా, మను, యముడు అనే పిల్లలు ఉన్నారు.సూర్యుని తేజస్సును భరించలేనటువంటి సంధ్య తన రూపంలో ఛాయా అనే మహిళను సృష్టించి తన తండ్రి వద్దకు వెళుతుంది. ఛాయా మనసు ఎంతో మంచిది ఈమె అచ్చం సంధ్య పోలికలతోనే ఉండటం వల్ల సూర్యుడు సంధ్య అని పొరపాటు పడతాడు. అయితే సూర్యుని కారణంగా ఛాయా గర్భంలో శిశువు పెరుగుతుంది. ఇకపోతే ఛాయా సూర్యని సేవలో నిమగ్నమై తపస్సు చేస్తూ గర్భవతిగా ఉన్న సమయంలో సరైన ఆహారం తీసుకోదు. ఈమె గర్భవతిగా ఉన్నప్పుడు సూర్యుడిని ధ్యానించడం వల్ల శనిఎన్నో శక్తులతో జన్మిస్తాడు.

శని దేవుడు జన్మించిన తర్వాత పోషకాహార లోపంతో చాలా నలుపు రంగులో జన్మిస్తారు. నలుపు రంగులో ఉన్న శని దేవుని చూసి సూర్యుడు తిరస్కరిస్తారు. శని దేవుడిని చూడగానే అసహ్యించుకున్న సూర్యుడు మొహం కూడా నల్లబడటంతో తన తప్పును గ్రహించి శని దేవుడు కూడా నవగ్రహాలలో ఒకటిగా అత్యంత శక్తివంతుడుగా ఉంటారని వరమిచ్చారు.ఇక పూజా కార్యక్రమాలలో, శుభకార్యాలలో నలుపు రంగును ఉపయోగించరు. అందుకే నలుపు రంగుకు ప్రాధాన్యత కల్పిస్తూ శని దేవుడు నలుపు రంగును ఇష్టమైన రంగుగా భావించడం వల్ల అందరూ నలుపు వస్తువులతో శనీశ్వరుడిని పూజించడం అలాగే పేదలకు నలుపు రంగు వస్తువులను దానం చేయడం వల్ల శని బాధలు తొలగిపోతాయనీ తెలిపారు.