టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు కమెడియన్ ప్రియదర్శి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట టెర్రర్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు ప్రియదర్శి. ఆ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన పెళ్లిచూపులు సినిమాతో ఒక్కసారిగా భారీ పాపులారిటిని సంపాదించుకున్నాడు. పెళ్లిచూపులు సినిమాలో నా చావు నేను చస్తా అనే ఒక్క డైలాగ్ తో బాగా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోల పక్కన నటించే అవకాశాలను దక్కించుకున్నాడు ప్రియదర్శి. అంతే కాకుండా ఈ మధ్యకాలంలో విడుదలైన సినిమాలలో ప్రియదర్శి తప్పకుండా ఉంటున్నాడు. ఇక సినిమాలలో తనదైన శైలిలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు.
ఇక నవీన్ పోలిశెట్టి నటించిన జాతి రత్నాలు సినిమాలో ప్రియదర్శి కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా కమెడియన్ ప్రియదర్శి చెప్పాలని ఉంది అనే ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోను ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినిమాల్లోకి వెళ్తానంటే ఇంట్లో వాళ్ళు అంగీకరించారా అని యాంకర్ ప్రశ్నించగా.. లేదు సినిమాల్లోకి వెళ్తాను అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. అందుకే కెమెరా వర్క్ నేర్చుకుంటాను సినిమాటోగ్రాఫర్ గా అవకాశాలు వస్తాయని ఇంట్లో చెప్పాను అని తెలిపారు ప్రియదర్శి. అలా 2014లో శ్రీకాంత్ హీరోగా నటించిన టెర్రర్ సినిమాలో పాత్రల కోసం ఆడియన్స్ చేస్తున్నారు అని తెలిసి వెళ్లాను. కానీ మొదట వాళ్ళు నన్ను తీసుకోలేదు కానీ ఆ తర్వాత ఆ పాత నేను సరిపోతాను అనిపించి నన్ను పిలిచారు అని చెప్పుకొచ్చాడు.
ఆ తర్వాత పెళ్లిచూపులు సినిమా తర్వాత మళ్లీ వెనుతిరిగి చూసుకోలేదు అని తెలిపాడు ప్రియదర్శి జీవితంలో విమర్శలను ఎదుర్కోలేదా? అని యాంకర్ ప్రశ్నించగా ఆ విషయం పై స్పందించిన ప్రియదర్శి.. చాలా సార్లు ఎదుర్కొన్నాను. ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు నల్లగా, సన్నగా ఉన్నాడు, మొటిమలు ఎక్కువ ఉన్నాయి. హీరో కంటే పొడుగ్గా ఉన్నాడు అనే హేళన చేస్తు మాట్లాడేవారు అప్పుడు నేను వాళ్ళు అలా అన్నప్పుడల్లా నన్ను నేను ప్రొత్సహించుకునే వాడిని అని చెప్పుకొచ్చాడు ప్రియదర్శి.