రెండు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు వరలక్ష్మీ వ్రతం వేడుకలను గ్రాండ్ గా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. నియమ నిష్టలతో ఎవరైతే వరలక్ష్మీ వ్రతం చేస్తారో వాళ్లకు ఆ దేవత అనుగ్రహం కచ్చితంగా ఉంటుంది. లక్ష్మీదేవిని కొలిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చాలామంది భావిస్తారు. అయితే దేవతను పూజించే సమయంలో కొన్ని రంగుల చీరలు అస్సలు ధరించకూడదు.
శ్రావణ శుక్రవారం రోజున పూజ చేస్తే వరమహాలక్ష్మి కటాక్షం మనపై ఉంటుందని చెప్పవచ్చు. అమ్మవారి ఆశీస్సుల కొరకు బంగారు వర్ణంలొ ఉన్న చీరను ధరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఆ కలర్ చీర లేని వాళ్లు ఆకుపచ్చ కలర్ చీరను ధరించడం ద్వారా అమ్మవారి కటాక్షంతో పాటు శుభ ఫలితాలను పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
అమ్మవారికి ఎరుపు, గులాబీ రంగు, పసుపు, గోధుమ రంగులు కూడా ఇష్టమైన రంగులు కావడం గమనార్హం. పూజ సమయంలో నలుపు, నీలం, బూడిద రంగుల చీరలు ధరించకూడదు. శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుంది. భక్తి శ్రద్దలతో నియమ నిష్టలు పాటిస్తూ అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వాళ్లకు కోటి జన్మల పుణ్య ఫలం లభిస్తుంది.
ఏదైనా కారణం వల్ల ఈరోజు పూజ చేయడం సాధ్యం కాని వాళ్లు రాబోయే శుక్రవారాల్లో పూజ చేసి దేవుని అనుగ్రహం పొందవచ్చు. వరలక్ష్మి వ్రతం చేసేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.