ఒక్క హిట్ లేకపోయినా….వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్న హీరో

సినిమా ఇండస్ట్రీ లో హిట్స్ లేకుంటే ఆఫర్స్ రావడం చాలా కష్టం. ఎంత స్టార్ హీరో కొడుకు అయినా…రెండు, మూడు ఫ్లోప్స్ వస్తే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ దగ్గరికి కూడా రారు. అలాంటిది ఒక యంగ్ హీరో కి వరుస పరాజయాలు వస్తున్నా కానీ ఆఫర్స్ మీద ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. ఆ హీరో నే ఆది సాయి కుమార్.

రీసెంట్ గా రిలీజ్ అయిన ‘బ్లాక్’, ‘తీస్ మార్ ఖాన్’ కనీసం రిలీజ్ అయినట్టు కూడా ఎవరికీ తెలియదు. అయినా కానీ ఆది ఇంకో సినిమా తో రిలీజ్ కి సిద్దమయ్యాడు. ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా సీఎస్ఐ సనాతన్. ఈ చిత్రంలో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సియ‌స్ ఐ) ఆఫీస‌ర్ గా ఆదిసాయికుమార్ ఒక కొత్త రోల్ లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు.

క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో గ్రిప్పింగ్ థ్రిల్ల‌ర్ గా వస్తున్న ఈ మూవీ లో ఆది సాయి కుమార్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఈ మూవీ నుండి వచ్చిన గ్లింప్స్ ఆసక్తికరంగా ఉంది. శివ‌శంక‌ర్ దేవ్ దర్శకత్వం లో వస్తున్న ఈ మూవీ లో మిషా నారంగ్, అలీ రెజా, నందిని రాయ్, తాక‌ర్ పొన్న‌ప్ప ,మ‌ధు సూద‌న్, వసంతి తదితరులు నటిస్తున్నారు.  ఈ సినిమా నవంబర్ రెండో వారం లో ప్రేక్షకుల ముందుకు రానుంది.