ఈ సంకేతాలను మీరు గుర్తించకపోతే లక్ష్మీదేవిని కాలదన్నుకున్నట్లే..?

మానవ జీవితంలో డబ్బు ముఖ్యపాత్ర పోషిస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని సందర్భాలలో లక్ష్మీదేవి కటాక్షం మనపై ఉండబోతుందని తెలుపటానికి కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ సంకేతాలను మనం గుర్తించలేక పోతే స్వయానా మనమే లక్ష్మీదేవిని కాలదనుకున్నట్లే . లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించే ముందు కొన్ని సంకేతాలు మనకు తెలుస్తాయి. వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

లక్ష్మీ అంటే ధన మాత్రమే కాదు.. ఆనందం, సంతృప్తి, సంస్కారం మంచి ఇలా అనేకమైన విషయాలు వస్తాయి. లక్ష్మీ అంటేనే అదృష్టం మంచి పనులతో చేసేది ఏదైనా సరే దాని లక్ష్మి అనే చెప్పవచ్చు. లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని తెలిపే సంకేతాల గురించి పండితులు ఏం చెబుతున్నారంటే… సాధారణంగా గుడ్లగూబని చూసిన వెంటనే భయం పుడుతుంది. కానీ మనకి గుడ్లగూబ కనిపించడం శుభశకునంగా భావించవచ్చు. ఇలా గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుందని తెలిపే సంకేతం. అలాగే కలలో మనం లేవగానే ఇల్లు ఊడిస్తున్నట్టు కనిపిస్తే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తున్నట్లు తెలిపే సంకేతం.

అలాగే కలలో చెరుకు గడ కనిపించిన సరే లక్ష్మీ అమ్మవారు మన గడపలోకి వస్తున్నట్లే అర్థం. ఇలా కలలో చెరుకుగడ కనిపించినప్పుడు శుక్రవారం రోజున ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేసి చెరుకు గడను నైవేద్యంగా సమర్పించాలి. అలాగే కొన్ని సందర్భాలలో మనకు లక్ష్మీదేవి స్వయంగా కలలో కనిపిస్తుంది. ఇలా కలలో లక్ష్మీదేవి కనిపించినప్పుడు కూడా ఆ దేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని తెలిపే సంకేతం. మరికొన్ని సందర్భాలలో రోడ్డు మీద వెళ్లేటప్పుడు డబ్బులు దొరుకుతాయి. అలా రోడ్డుమీద డబ్బు దొరకటం కూడా లక్ష్మీదేవి అనుగ్రహం మనకి లభిస్తుందని తెలిపే సంకేతం. ఇవన్నీ కనిపిస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని అర్థం.