తల తిరగడం వల్ల ఇబ్బందులు పడుతున్నారా.. సులువుగా చెక్ పెట్టే చిట్కాలు ఇవే!

ఈ మధ్య కాలంలో చాలామందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో తల తిరగడం కూడా ఒకటి. వినడానికి చిన్న సమస్యలా అనిపించినా ఈ సమస్య చాలా ఇబ్బంది పెడుతుందని చెప్పవచ్చు. కూర్చున్న సమయంలో అక్స్మాత్తుగా కళ్లు తిరుగుతున్నట్టు అనిపిస్తే మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఐరన్ లోపించడం వల్ల కూడా కొంతమందిలో ఈ సమస్య తలెత్తుతుందని చెప్పవచ్చు.

రక్తహీనత సమస్యతో బాధపడేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. నాడీ వ్యవస్థ సరిగా పనిచేయకపోయినప్పుడు ఈ విధంగా జరిగే ఛాన్స్ ఉంటుంది. సుదీర్ఘంగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు కూడా శరీరానికి రక్తం సప్లై సరిగా ఉండకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తే అవకాశాలు అయితే ఉంటాయి. 65 సంవత్సరాల వయసు పైబడినవారిలో ఈ సమస్య సాధారణంగానే కనిపించే సమస్యలలో ఒకటి.

హిమోగ్లోబిన్(హెచ్‌బీ) లెవెల్స్ తక్కువగా ఉన్న సమయంలో సైతం తల తిరిగే ఛాన్స్ ఉంటుంది. ఈ సమస్యతో బాధ పడే వాళ్లలో మెదడుకు ఆక్సిజన్ ను అందించడంలో ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పవచ్చు. వివిధ రకాల మందుల వాడకం, రక్తపోటు సంబంధిత సమస్యలు ఉన్నవారికి సైతం కళ్లు తిరుగుతున్నాయని అనిపించవచ్చు. ఈ లక్షణాలలో ఏది కనిపించినా జాగ్రత్త పడక తప్పదు.

తల తిరగడం చిన్న లక్షణం అయినా తగిన సమయంలో ఔషధాలు తీసుకోవడం ద్వారా మంచిది. కొన్ని సందర్భాల్లో వైద్య చికిత్సలు చేయించడం ద్వారా ఈ సమస్యలను సులువుగా అధిగమించే అవకాశం ఉంటుంది. తల తిరగడం సమస్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఉంటుంది.