మనలో చాలామంది పెళ్లి చేసుకునే అమ్మాయి విషయంలో కొన్ని ఆలోచనలను కలిగి ఉంటారు. పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అమ్మాయి పర్ఫెక్ట్ అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. పెళ్లి తర్వాత ఆనందంగా, ఎలాంటి కష్టాలు లేకుండా జీవించాలని చాలామంది ఫీలవుతారు. భార్యాభర్తల మనస్తత్వం ఆధారంగా భవిష్యత్తు జీవితం ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. దయా, సేవా గుణం ఉన్న స్త్రీలను పెళ్లి చేసుకుంటే జీవితం సంతోషంగా ఉంటుంది.
దురాశ లేని అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. అధ్యాత్మిక భావన ఉన్న స్త్రీలను పెళ్లి చేసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలను పొందవచ్చు. మంచి ప్రవర్తన కలిగిన అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం ద్వారా ఆ కుటుంబానికి శాంతి, ఆనందం కలుగుతాయి. భర్తకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా నిలబడే అమ్మాయిలకు లైఫ్ లో ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి.
ఆర్థిక, కుటుంబ స్థితిగతులను మేనేజ్ చేసుకునే అమ్మాయి మన జీవితంలోకి వస్తే మంచిది. తను నవ్వుతూ ఇంటిని సంతోషంగా మార్చే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. భాగస్వామి విషయంలో పొరపాట్లు చేస్తే మాత్రం దీర్ఘకాలంలో ఇబ్బందులు తప్పవు. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకునే విషయంలో ఎవరి వ్యక్తిగత అభిప్తాయాలు వారికి ఉంటాయనే సంగతి తెలిసిందే.
భాగస్వామి విషయంలో పొరపాట్లు చేస్తే జీవితాంతం ఇబ్బందులు తప్పవు. ఈ విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి. భాగస్వామికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే మాత్రం జీవితాంతం ఇబ్బందులు పడే అవకాశాలు అయితే ఉంటాయి.