వర్షాకాలం, చలికాలం అనే తేడాల్లేకుండా ఈ రెండు కాలాలలో చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్యలలో దోమల సమస్య కూడా ఒకటి. దోమల వల్ల కొన్ని సందర్భాల్లో నిద్రలేని రాత్రులుగడపాల్సి వస్తుంది. మస్కిటో కాయిల్స్ ను వాడటం ద్వారా ఈ సమస్యకు వేగంగా చెక్ పెట్టవచ్చు. కొన్ని లిక్విడ్స్ సహాయంతో కూడా దోమల సమస్య తేలికగానే దూరమవుతుంది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టడానికి కొన్ని అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి.
నిద్రపోవడానికి గంట ముందు అరటిపండు తొక్కలను గదిలోని నాలుగు మూలల్లో ఉంచడం ద్వారా దోమల సమస్య దూరమవుతుంది. అరటి తొక్కల పేస్ట్ ను దోమలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో అప్లై చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందవచ్చు. గ్లాసు నీటిలో కర్పూరంను వేసి ఆ కర్పూరంను స్ప్రే చేయడం ద్వారా కూడా దోమల సమస్యకు చెక్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది.
ఆయుర్వేదంలో ఎక్కువగా వినియోగించే యూకలిప్టస్ ఆకులను ఎండబెట్టి వాటిని కాల్చడం ద్వారా కూడా దోమల సమస్యను దూరం చేసుకోవచ్చు. సాధారణంగా మనుషులను ఆడ దోమలు మాత్రమే కుడతాయి. మనిషి శరీరపు వేడి, మనిషి శ్వాసలోని బొగ్గుపులుసు వాయువు, తేమ, శరీరపు వాసన వంటి సంకేతాలను ఆధారంగా దోమలు కుట్టే వ్యక్తులను నిర్ణయించుకుంటాయి.
ముదురు రంగు దుస్తులు వేసుకున్న వారివైపు దోమలు ఎక్కువగా ఆకర్షితం అవుతాయి. ఓ బ్లడ్ గ్రూప్ వారిని దోమలు ఎక్కువగా కుడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శరీరంపై వేడి ఎక్కువగా ఉండే వాళ్లను దోమలు సులువుగా టార్గెట్ చేస్తాయి. మహిళలు గర్భంతో ఉన్న సమయంలో శరీరంలో జీవక్రియలు వేగవంతం అవుతాయి. మద్యం తాగేవాళ్లను సైతం దోమలు ఎక్కువగా టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది.