AR Rahman-Mohini Dey: ఒకేసారి విడాకులు తీసుకున్న రెహమాన్,మోహిని.. అసలు విషయాన్ని చెప్పి షాకిచ్చిన బాను లాయర్!

AR Rahman-Mohini Dey: టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తాజాగా తన 29 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ తన భార్యతో విడాకులు తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఆయన సతీమణి సైరా భాను ప్రకటించింది.. సంచార జీవితంలో ఏర్పడిన కొన్ని ఇబ్బందులు కారణంగా పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకుంటున్నట్లు ఆమె తరపు న్యాయవాది వందన వెల్లడించారు. ఈ మేరకు తాజాగా ఒక ప్రకటనను కూడా విడుదల చేశారు.

అయితే రెహమాన్ విడాకులు తీసుకున్న రోజే కొన్ని గంటల వ్యవధిలోనే రెహమాన్ అసిస్టెంట్ అయిన మోహిని కూడా తన భర్త నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఇలా ఇద్దరు కొన్ని గంటల వ్యవధిలోనే విడాకులు తీసుకొని విడిపోవడంతో ఈ విషయం పట్ల అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రెహమాన్ కు, మోహినికి మధ్య ఏదో సంబంధం ఉందంటూ సోషల్ మీడియా వేదికగా పుకార్లు షికారు చేశాయి. ఈ వార్తలపై తాజాగా సైరా బాను న్యాయవాది వందనా షా స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పారు.

రెహమాన్, మోహని గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై సైరాబాను న్యాయవాది వందన తోసిపుచ్చారు. రెహమాన్ విడాకులకు, ఆయన అసిస్టెంట్ విడాకులకు ఎటువంటి సంబంధం లేదు. సైరా, రెహమాన్ సొంతంగా విడిపోవాలనే నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. మరో వ్యక్తి కారణంగా ఈ విడాకులు తీసుకోవడం లేదు. అనవసర చర్చ అవసరం లేదు అని లాయర్ వందన చెప్పుకొచ్చారు. అలా అసలు విషయం చెప్పడంతో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్టు అయింది.