ఇంట్లో ఈ తప్పులు చేస్తే లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురి కావాల్సిందే.. ఈ పొరపాట్లు చేయొద్దంటూ?

మనం కొన్నిసార్లు తెలిసీతెలియకుండా చేసే చిన్నచిన్న తప్పులే మనల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటాయి. ఆ తర్వాత మనం ఏ విషయంలో తప్పు చేశాయో తెలిసినా ఎలాంటి ఫలితం ఉండదు. మనలో చాలామంది ఇంటి నిర్మాణం సమయంలో వాస్తుకు సంబంధించిన పొరపాట్లను చేస్తూ ఉంటారు. ఆ పొరపాట్లు దీర్ఘకాలంలో మన కుటుంబంపై చూపే ప్రభావం అంతాఇంతా కాదు. వాస్తు విషయంలో తప్పులు చేస్తే దీర్ఘకాలంలో ఆ ఫలితాలను అనుభవించాల్సి ఉంటుంది.

మనలో చాలామంది తిన్న ప్లేట్లను, గిన్నెలను ఎక్కడ పడితే అక్కడ అలాగే వదిలేస్తూ ఏ మాత్రం నీట్ నెస్ ను పాటించకుండా ఉంటారు. ఈ విధంగా చేయడం వల్ల నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఎవరైతే ఈ విధంగా చేస్తారో వాళ్ల కుటుంబంలో నెగిటివ్ ఎనర్జీ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. బెడ్ పై కూర్చొని ఆహారం తినే అలవాటు మనలో చాలామందికి ఉంటుంది.

అయితే ఈ అలవాటు వల్ల కూడా నష్టపోక తప్పదని చెప్పవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని శుభ్రంగా ఉంచుకోకుండా ఇష్టం వచ్చిన విధంగా ఉంచితే మాత్రం తీవ్రస్థాయిలో నష్టపోవాల్సి ఉంటుంది. ఇంట్లో కిచెన్ ఆగ్నేయం వైపు ఉండాలి. అక్కడ కాకుండా మరో చోట ఉంటే మాత్రం నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. వంటగది, బాత్ రూమ్ పక్కపక్కనే ఉంటే చెడు ఫలితాలు కలుగుతాయి.

వాస్తుకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వాస్తు నిపుణులను సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకుంటే మంచిది. వాస్తు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దీర్ఘకాలంలో చెడు ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. అయితే వాస్తు విషయాలకు సంబంధించి ఖర్చు చేసే విషయంలో ఒకటికి రెండుసార్లు నిపుణుల సలహాలను తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.