మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో రోజ్ వాటర్ ను వినియోగించి ఉంటారు. చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో రోజ్ వాటర్ ఎంతగానో సహాయపడుతుంది. చర్మంపై ఉండే చికాకు, మంట రోజ్ వాటర్ వల్ల సులువుగా తగ్గుతాయని చెప్పవచ్చు. మణికట్టు, చంకలపై రోజ్ వాటర్ రాయడం వల్ల దుర్వాసన సమస్య దూరమవుతుంది. రోజ్ వాటర్ ను ముఖానికి స్ప్రే చేయడం వల్ల ముఖంపై ఉండే దుమ్ము, ధూళి దూరమవుతాయి.
తలనొప్పి సమస్యతో బాధ పడేవాళ్లు రోజ్ వాటర్ వాసన చూడటం ద్వారా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. తలస్నానం చేసిన తర్వాత జుట్టుకు రోజ్ వాటర్ అప్లై చేస్తే జుట్టు మంచి వాసన రావడంతో పాటు స్మూత్ గా మారుతుంది. రోజ్ వాటర్ వల్ల దీర్ఘకాలంలో ఎన్నో లాభాలను పొందవచ్చు. రోజ్ వాటర్ ను ఎక్కువగా వాడే వాళ్లు ఈ విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.
రోజ్ వాటర్‌ని వారానికి రెండు సార్లు చర్మానికి రాసుకుంటే ఎప్పటికప్పుడు వచ్చే అధిక సెబమ్ ఉత్పత్తిని నియంత్రిస్తుందని చెప్పవచ్చు. ఎరుపు, చర్మశోథ, తామర వంటి వివిధ చర్మ సమస్యలను నివారించడంలో రోజ్ వాటర్ ఉపయోగపడుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్న రోజ్ వాటర్ మచ్చలు, గాయాలు, కోతలను నయం చేయడానికి కూడా తోడ్పడుతుంది.
జుట్టు సంబంధిత సమస్యలకు కూడా రోజ్ వాటర్ తో చెక్ పెట్టే అవకాశాలు ఉంటాయి. రోజ్ వాటర్‌లో కాటన్ ప్యాడ్‌లను ముంచి మీ కనురెప్పలపై అప్లై చేస్తే కళ్ల చుట్టూ ఉన్న వేడిని తగ్గించడం ద్వారా తక్షణ ఉపశమనం పొందే అవకాశాలు ఉంటాయి.