శుక్రవారం పటిక బెల్లంతో ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైనే?

సాధారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు ఇలా పూజలు చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుందని భావిస్తారు ఈ క్రమంలోనే అమ్మవారి అనుగ్రహం మనపై కలిగి ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే శుక్రవారం పటిక బెల్లంతో ఈ చిన్న పరిహారం చేయటం వల్ల అమ్మవారి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి.వాస్తు శాస్త్రం ప్రకారం పట్టిక బెల్లానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అందుకే పట్టిక బెల్లంతో ఈ చిన్న పరిహారాలు చేయటం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి గొడవలు తొలగిపోయి సుఖ సంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి.

పటిక బెల్లం ఇంట్లో ఉంచటం వల్ల ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని ప్రజల విశ్వాసం. పటిక బెల్లం ఇంట్లో ఉంచడం వల్ల ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యం కలుగుతాయి. పటిక బెల్లం వల్ల ఆ ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు వెల్లడించారు. ఈ పటిక బెల్లం ఉపయోగించి కొన్ని రకాల పరిహారాలు చేయడం వల్ల ఇంట్లో తరచూ జరిగే గొడవలు తొలగిపోయి మనశ్శాంతి లభిస్తుంది. ఒక చిన్న గిన్నెలో నీరు పోసి అందులో కొంచెం పట్టిక బెల్లం వేసి ఇంట్లోనే ఒక మూలలో దీనిని ఉంచడం వల్ల తరచూ ఇంట్లో జరిగే గొడవలు తగ్గిపోయి మనశ్శాంతి లభిస్తుంది.

ఇంట్లో తరచూ సమస్యలు గొడవలు పోట్లాటలు ఏర్పడుతూ ఉంటే 50 గ్రాముల పట్టిక బెల్లాన్ని ఒక గిన్నెలో వేసి పూజ గదిలో ఉంచటం వల్ల సమస్యలు తొలగిపోవడమే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత చేకూరుతుంది. శుక్రవారం రోజున పూజ గదిలో పటికబెల్లాన్ని ఉంచి ఆ లక్ష్మీదేవికి ఇష్టమైన తామర పువ్వులు సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఆర్థిక సమస్యలు తొలగిపోవడమే కాకుండా ధన ప్రాప్తి కలుగుతుంది. ఇలా ఐదు శుక్రవారం పాటు చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు.