ఈ పువ్వులతో షుగర్ వ్యాధికి శాశ్వతంగా చెక్ పెట్టవచ్చట.. ఎలా అంటే?

ఒకప్పుడు కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే ధనవంతులు అని అనేవారు. ఇప్పుడు ఎవరైతే ఆరోగ్యంతో ఉంటారో వాళ్లను మాత్రమే ధనవంతులు అని పిలుస్తున్నారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిని కొత్తకొత్త ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. షుగర్, క్యాన్సర్, గుండె సమస్యలు ప్రస్తుత కాలంలో సాధారణం అయిపోయాయి. చిన్న వయస్సులోనే గుండె సంబంధిత సమస్యలతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు.

అయితే షుగర్ వ్యాధి బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండగా మందార పువ్వుల సహాయంతో ఈ సమస్యకు చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి. మందారం ఆకులు సాధారణంగా జుట్టు సంబంధిత సమస్యలకు చెక్ పెడతాయి. చుండ్రు సహా ఇతర సమస్యలు తొలగిపోయి జుట్టు ఒత్తుగా మారడంలో ఈ పూలు సహాయపడతాయి. ఈ పూలను పానీయంలా చేసుకుని తాగడం ద్వారా ఇన్సులిన్ స్థాయిలు నియంత్రించి షుగర్ వ్యాధి కంట్రోల్ లో ఉంటుంది.

మధుమేహాన్ని నియంత్రించేందుకు ఉపయోగపడే వాటిలో అరటిపువ్వు కూడా ఒకటి. అరటి పువ్వుతో చేసిన కూరలు తినడం ద్వారా రక్తంలో షుగర్ లెవెల్స్ పూర్తిస్థాయిలో కంట్రోల్ లోకి వస్తాయని చెప్పవచ్చు. అరటి పువ్వులు తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్ ఎ, సి, బి-6, మెగ్నీషియం పోషకాలు లభిస్తాయి. మడగాస్కర్ పెరివింకిల్ సైతం షుగర్ ను సులువుగా కంట్రోల్ చేస్తుంది.

చర్మ సమస్యలు, గొంతు వ్యాధులు సహా అనేక రోగాలను తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది. ప్రీ డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాలను తగ్గించడంలో దాలియా పువ్వు తోడ్పడుతుంది. చర్మం మృదువుగా మారి ఆకర్షణీయంగా ఉండేందుకు ఈ పువ్వు ఉపయోగపడుతుంది.