ప్రస్తుత కాలంలో ఎక్కువ సంఖ్యలో ఆహార ఉత్పత్తులను ఎక్కువ కాలం నిల్వ ఉంచేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆహారాన్ని నిల్వ ఉంచడం కోసం చాలామంది ప్రిజర్వేటివ్స్ పై ఆధారపడుతున్నారు. షుగర్, ట్రాన్స్ ఫ్యాట్ అధికంగా ఉన్న జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉండవనే సంగతి తెలిసిందే. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
చిన్న పిల్లలకు సైతం ఎదిగే వయస్సులోనే సరైన ఆహారపు అలవాట్లను నేర్పిస్తే మంచిదని చెప్పవచ్చు. పిల్లలకు పోషకాలు ఉన్న ఆహారాన్ని అందించడం ద్వారా మేలు జరుగుతుంది. ఇష్టానుసారం ఆహారం తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవని చెప్పవచ్చు. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మాంసకృత్తులు తగుపాళ్లలో ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయి.
రైస్ తో చేసిన ఆహారం కంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఆహారం పిల్లలకు ఇవ్వడం ద్వారా పిల్లల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెప్పవచ్చు. ప్యాకేజ్డ్ ఫుడ్స్ లో 95 శాతం తినడానికి యోగ్యం కాదని అదే అలవాటుగా మారితే మాత్రం ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది. ఫుడ్స్ లో వాడే సింథటిక్ కలర్స్, అడిటివ్స్, ప్రిజర్వేటివ్స్ వల్ల నష్టం కలుగుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
జంక్ ఫుడ్ అలవాట్ల వల్ల పిల్లల ఆరోగ్యం దారుణంగా దెబ్బ తింటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పిల్లలు వేరుశనగ చిక్కీ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెప్పవచ్చు. ఎముకల ఆరోగ్యం తగ్గిపోతుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. నువ్వుల లడ్డూలను పిల్లలు తీసుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు.