బీర్ తాగితే ఇంత ప్రమాదమా.. ఎక్కువగా తాగితే మాత్రం అలా నష్టపోయే ఛాన్స్ ఉందా?

రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం తాగే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. మద్యం తాగేవాళ్లలో ఎక్కువమంది బీరు తాగడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే బీర్ తాగడం వల్ల లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పార్టీలైనా, పండగలైనా సందర్భం ఏదైనా బీరు తాగడానికి ఎక్కువమంది ఉత్సాహం చూపిస్తారు.

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా తాగే బేవరేజెస్‌లో బీర్ మొదటి స్థానంలో ఉంది. ఇతర కాలాలతో పోల్చి చూస్తే వేసవి కాలంలో బీర్ల అమ్మకాలు ఒకింత ఎక్కువగా ఉంటాయి. అయితే బీర్లు అతిగా తాగడం వల్ల శరీరానికి నష్టమే తప్ప లాభం లేదు. అప్పుడప్పుడూ బీర్ తాగడం మంచిదే కానీ తరచూ బీర్ తాగితే మాత్రం ఇబ్బందులు పడక తప్పదు. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ నివేదిక వెల్లడించిన విషయాల ప్రకారం రోజూ బీర్ తాగితే బరువు పెరుగుతారు.

బరువు పెరగడం వల్ల ఊబకాయం, ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. ఎక్కువగా బీర్ తాగడం కాలేయం చెడిపోయే అవకాశం ఉంటుంది. కాలేయం చుట్టూ కొవ్వు పేరుకుపోవడం, ఆల్కహాలిక్ హెపటైటిస్, కాలేయ వాపు వంటి వ్యాధుల వల్ల లివర్ పాడై ప్రాణాలు కోల్పోయే అవకాశాలు అయితే ఉంటాయి. బీరు అధికంగా తాగితే గుండె జబ్బులు వెంటాడతాయి.

బీర్ తాగడం వల్ల హృదయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలతో పాటు హృదయ సంబంధిత సమస్యలు వస్తాయి. నిత్యం బీరు తాగితే కంటి నిండా నిద్ర కరువవుతుంది. బీర్ రోజూ తీసుకుంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. మహిళలైతే ఒక్క జగ్గు బీరు, పురుషులు రెండు జగ్గుల బీరు వరకు తాగొచ్చని మోతాదు మించితే మాత్రం ప్రాణాలకే ప్రమాదమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.