మేకప్ సరిగా వేయలేదని ఈ పెళ్లి కూతురు చేసిన పని తెలిస్తే అందరు షాక్ అవుతారు…?

సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక అద్భుతమైన ఘట్టం. అయితే తన పెళ్లి వేడుకలో అందరికన్నా ఎంతో ప్రత్యేకంగా కనిపించాలని పెళ్లికూతురు భావిస్తూ ఉంటుంది. పెళ్లిలో అందంగా ముస్తాబు అవ్వటానికి వేల రూపాయలు ఖర్చు చేసి బ్యూటీ పార్లర్లకు వెళ్లి ఫేషియల్, మేకప్ అంటూ అందంగా ముస్తాబవుతారు. కొన్ని సందర్భాలలో అలా వేల రూపాయలు ఖర్చు చేసినా కూడా మేకప్ సరిగా వేయలేదని కొంతమంది పెళ్లికూతుర్లు అసహనం వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక పెళ్ళి కూతురూ మాత్రం తన పెళ్లిరోజు మేకప్ సరిగా వేయలేదని ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.

అసలు విషయం ఏమిటంటే…మధ్యప్రదేశ్ లోని జబల్ పురా పరిధిలోని కొత్వాలి ప్రాంతంలో నివాసం ఉంటున్న ఒక మహిళకు వివాహం నిశ్చయం అయింది. ఈ క్రమంలో ఆ యువతి పెళ్లి రోజు సందర్భంగా మేకప్ వేయించుకోవడానికి ఇటీవల స్థానికంగా ఉండే మౌనిక మేకప్ స్టూడియోకి వెళ్లింది. పెళ్లి కూతురుకి మేకప్ వేయడానికి ఆ మేకప్ స్టూడియో వారు రూ. 3500 ఖర్చు అవుతాయని చెప్పడంతో ఆ పెళ్లి కూతురు డబ్బులు పూర్తిగా చెల్లించింది. ఇక డిసెంబర్ మూడవ తేదీన ఆ యువతి పెళ్లి రోజున మేకప్ స్టూడియో నుండి వచ్చిన కొందరు వ్యక్తులు ఆ యువతిని పెళ్లికూతురుగా ముస్తాబు చేశారు. అయితే వారు వేసిన మేకప్ ఆ యువతికి నచ్చకపోయినా కూడా అలాగే పెళ్లి మండపంలోకి వెళ్లి కూర్చోని తాళి కట్టించుకుంది.

ఇక పెళ్లి వేడుక పూర్తి అయిన తరువాత ఆ యువతి స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి తనకు సరిగా మేకప్ వేయలేదని మౌనిక మేకప్ స్టూడియో వారి మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. వేల రూపాయలు ఫీజుగా చెల్లించినప్పటికీ తనకు మేకప్ సరిగా చేయలేదని ఎలాగైనా తనకు న్యాయం చేయాలని సదరు యువతీ పోలీసులను కోరింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా మౌనిక మేకప్ స్టూడియో యజమానిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.