కలలో ఈ దేవుళ్ళు కనిపించటం దేనికి సంకేతమో తెలుసా..?

సాధారణంగా నిద్రపోతున్న సమయంలో అందరికీ కలలు వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో మంచి కలలు వస్తుంటే మరికొన్ని సందర్భాలలో పీడకలు వస్తూ ఉంటాయి. అయితే ఎలా కలలు రావడం మన జీవితంలో జరగబోయే కొన్ని మంచి చెడుల గురించి తెలుపుతాయి. అప్పుడప్పుడు కలలో దేవుళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఇలా దేవుళ్ళు కనిపించటం అనేది మన జీవితంలో జరగబోయే విషయాలనూ తెలిపే సంకేతంగా భావిస్తారు. మరి మన కలలో దేవుడు కనిపించడం మంచిదేనా.. ?అది దేనికి సంకేతం..? కలలో ఏ దేవుడు కనిపిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

• కొన్ని సందర్భాలలో లక్ష్మి దేవి కలలో కనిపిస్తూ ఉంటుంది. మీ కలలో లక్ష్మీదేవి కమలంపై కూర్చున్నట్లు కనిపిస్తే అది సంపదకు చిహ్నం. మీ కలలో లక్ష్మీ దేవి ఇలా కనిపిస్తే త్వరలోనే మీకు ధన ప్రాప్తి లభిస్తుందని అర్థం.
• అలాగే మీ కలలో దుర్గామాత కోపంగా కనిపిస్తే ఆ కల అశుభ పరిణామానికి సంకేతంగా భావించాలి. అంటే దుర్గా మాత మీపై కోపంగా ఉందని అర్థం. ఒకవేళ దుర్గామాత సింహంపై స్వారీ చేసినట్లు మీకు కలలో కనిపిస్తే.మీ జీవితంలో సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని అర్థం.
• ఒకవేళ మీ కలలో శివుడి కనిపిస్తే మీరు సమస్యల నుంచి అతి త్వరలో విముక్తి పొందనున్నారని అని అర్ధం. శివుడు కలలో కనిపిస్తే మీకు ఉన్న అన్ని ఇబ్బందులు తొలిగినట్లే. మీ కలలో శివలింగాన్ని చూసినట్లయితే, అది కూడా ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు.
• అలాగే మీ కలలో శ్రీకృష్ణుడు కనిపిస్తే స్నేహం లేదా మరేదైనా బంధం ద్వారా మీ జీవితంలో ప్రేమ చిగురిస్తుందని అర్ధం. ఒకవేళ మీరు ఎవరితోనైనా ప్రేమలో ఉంటే మీ ప్రేమ సక్సెస్ అవుతుంది.
• అలాగే మీరు కలలో రాముడిని చూస్తే చాలా శుభప్రదంగా భావించాలి. ఇలా శ్రీ రాముడు కలలో కనిపించటం మీ జీవితంలో పురోగతికి అవకాశాలు లభిస్తాయని తెలిపే సంకేతం.అయితే మీ విధులను సక్రమంగా నిర్వర్తించాలి .