మామూలుగా మనం పడుకొని నిద్రపోతున్నప్పుడు ఎన్నో రకాల కలలు వస్తుంటాయి. అందులో కొన్ని మంచి కలలు అయితే మరికొన్ని చెడ్డ కలలు అలాగే మరికొన్ని దేవుళ్లకు సంబంధించిన కలలు కూడా వస్తూ ఉంటాయి. అయితే స్వప్న శాస్త్ర ప్రకారం మామూలుగా కలలు భవిష్యత్తును సూచిస్తాయని చెబుతూ ఉంటారు. అయితే చాలామందికి కలలో ఎత్తు నుంచి కింద పడిపోతున్నట్లు అలాగే ఎవరో ఎత్తు పైనుంచి తోసేసినట్టు ఇలా రకరకాల పీడకలలు వస్తూ ఉంటాయి.
మరి కలలు అలా రావడం మంచిదేనా అలా వస్తే అది దేనికి సంకేతమో ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మీరు కలలో పై నుంచి కింద జారిపడిపోయినట్టు కలలు కంటే మంచిది కాదు. డ్రీమ్ సైన్స్ ప్రకారం.. ఇది మంచి కలగా పరిగణించబడదు. ఈ కల అర్థం మీ ఫ్రెండ్ లేదా బంధువు మీకు ద్రోహం చేయచ్చు. అందుకే ఇలాంటి కల పడ్డప్పుడు మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇది కొంచెం వింతగానే అనిపిస్తుంది. కానీ కొంతమంది ఆకాశం నుంచి కూడా కింద పడ్డట్టు కలలు కంటుంటారు. ఈ కలను కూడా అశుభంగా భావిస్తారు.
ఈ కల పడితే మీ జీవితంలో అనుకోని చెడు ఘటనలు జరగొచ్చని అర్థం. అందుకే ఇలాంటి కల పడ్డప్పుడు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి.
మీరు నిద్రపోతున్నప్పుడు పర్వతం నుంచి కింద పడుతున్నట్టు కలలు కంటే కూడా మంచిది కాదు. దీన్ని దురదృష్టకరమైన కలగా పరిగణిస్తారు. ఇలాంటి కల పడితే మీరు భవిష్యత్తులో సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చు. చాలా మందికి ఇంటి పై కప్పు నుంచి కింద పడిపోయినట్టు కూడా కలలు కంటుంటారు. కానీ ఇలాంటి కలలు పడితే భవిష్యత్తులో కుటుంబ కలహాలు తలెత్తుతాయట. ఇలాంటి కలలు పడ్డప్పుడు మీరు మీ కుటుంబంలో సామరస్యం తీసుకురావడానికి ప్రయత్నించాలి.