మన హిందూ ధర్మంలో కొబ్బరికాయకు చాలా ప్రాముఖ్యత ఉంది. శుభకార్యాలలో కొబ్బరికాయ కొడితే గాని ఆ శుభకార్యం పూర్తి అవ్వదు. అలాగే దేవాలయాలకు వెళ్ళినప్పుడు కూడా దేవుడి ఎదుట కొబ్బరికాయ కొట్టడం వల్ల మంచి జరుగుతుందని ప్రజలు భావిస్తారు. అంతేకాకుండా ఏదైనా పనులు ప్రారంభించే సమయంలో కూడా కొబ్బరికాయ కొట్టడం శుభప్రదంగా భావిస్తారు. ఇలా ఏదైనా పనులు ప్రారంభించేటప్పుడు కొబ్బరికాయ కొట్టడం శాంతి కారకం… అరిష్ట నాశకం. అయితే ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ కొబ్బరి కాయ కొట్టే సమయంలో కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రధానంగా దేవాలయాలలో కొబ్బరికాయ కొట్టేటప్పుడు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. దేవుడి ఎదుట కొబ్బరికాయ కొట్టే ముందు దానిని మంచి నీటితో శుద్ధి చేయాలి. ఆ తర్వాత టెంకాయ పీచు ఉన్న ప్రదేశంలో కొబ్బరికాయ పట్టుకొని ఆ దేవుడిని స్మరించుకొని టెంకాయను కొట్టాలి. అయితే కొబ్బరికాయ కొట్టే సమయంలో కింద ఉన్న రాయి ఆగ్నేయ దిశలో ఉండేలా చూసుకోవాలి. అంతేకాకుండా కొబ్బరికాయ కుట్టేటప్పుడు 9 అంగుళాల ఎత్తు నుండి కొట్టడం శుభప్రదంగా
కొబ్బరికాయ కొట్టి రెండు ముక్కలు చేసిన తర్వాత వాటికి పసుపు కుంకుమ పెడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఆ పూజ విరుద్ధ పూజ అవుతుంది. అయితే కొన్ని సందర్భాలలో కొబ్బరికాయ కుళ్లిపోయి ఉంటుంది. దీంతో అందరూ దానిని అశుభ్రంగా భావిస్తారు. అటువంటి సమయంలో సర్వం సర్వేశ్వరార్పితం అని భావించి పరమాత్మున్ని 108 సార్లు జపిస్తే సరిపోతుంది. ఇక భక్తులు కొబ్బరినీటితో దేవుడికి అభిషేకాలు చేస్తూ ఉంటారు. అయితే చాలామంది ఆ కొబ్బరికాయను రెండు ముక్కలు చేయకుండా చేత్తో పట్టుకొని అభిషేకం చేస్తూ ఉంటారు. పొరపాటున కూడా అలా చేయకూడదు. కొబ్బరికాయ రెండు ముక్కలు చేయకుండా చేత్తో పట్టుకొని అలాగే అభిషేకం చేసిన టెంకాయ నైవేద్యానికి పనికిరాదు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత అన్నిటిని ఒక పాత్రలోకి తీసుకొని తర్వాత దేవుడికి అభిషేకం చేయాలి.