గుడికి వెళ్లి కొబ్బరికాయ కొట్టకపోతే ఇంత నష్టమా.. చెడు జరుగుతుందా?

coconut-breaking-in-India

మనలో కొంతమంది పండుగల సమయంలో మాత్రమే గుడికి వెళ్లడానికి ఆసక్తి చూపితే మరి కొందరు మాత్రం ప్రతి వారం గుడికి వెళతారు. గుడికి వెళ్లడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉండటంతో పాటు మనం కోరుకున్న కోరికలు సులువుగా నెరవేరతాయని చాలామంది భావిస్తారు. గుడికి వెళ్లే సమయంలో కొబ్బరికాయ కొట్టే విషయం గురించి కూడా ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉంటాయనే సంగతి తెలిసిందే.

కొంతమంది ఎప్పుడో ఒకసారి మాత్రమే కొబ్బరికాయ కొట్టడానికి ఆసక్తి చూపిస్తే మరి కొందరు మాత్రం ప్రతిసారి కొబ్బరికాయ కొడతారు. అయితే పండితులు మాత్రం గుడికి వెళ్లిన ప్రతి సందర్భంలో టెంకాయ కొట్టాలని అలా చేస్తే మాత్రమే శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కొబ్బరికాయ కొట్టే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పొరపాట్లు చేస్తే మాత్రం నష్టపోక తప్పదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఎవరైతే గుడికి వెళతారో వాళ్లకు అప్పటివరకు ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోయే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. సరైన పద్ధతిలో కొబ్బరికాయ కొడితే మాత్రమే అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కొబ్బరికాయను శుభ్రంగా కడిగి మాత్రమే కొట్టాలి. రాయిని ఆగ్నేయ దిశలో ఉంచి ఎనిమిది అడుగుల ఎత్తు నుంచి కొబ్బరికాయను కొడితే మంచిదని చెప్పవచ్చు.

ఇలా కొట్టడం వల్ల కొబ్బరికాయ రెండు ముక్కలుగా చీలే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కొబ్బరికాయలో పువ్వు వస్తే మాత్రం మరింత మంచి జరిగే అవకాశం ఉంటుంది. కొబ్బరికాయ కుళ్లిపోయినా, నల్లగా ఉన్నా చెడు జరిగే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. కొబ్బరికాయను కొట్టిన వెంటనే టెంకాయకు ఉన్న పీచును తీసెయ్యాలి. కొబ్బరికాయ కొట్టి కుంకుమ బొట్టు పెట్టడంతో పాటు చక్కెరను కూడా దేవునికి నైవేద్యంగా ఇస్తే మంచిది.