సాధారణంగా మన కుటుంబసభ్యులు మరణించిన తర్వాత వారి గుర్తుగా వారి ఫొటోలను ఇంట్లో ఉంచుకుంటాము. అంతే కాకుండా ప్రత్యేకమైన రోజులు, పండగ వేళల్లో వారికి ఆ ఫోటోలకు పూజలు కూడా చేస్తుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం చనిపోయిన వారి ఫొటోలను ఇంట్లో ఉంచుకోవటం మంచిదా? లేదా? ఒకవేళ ఆ ఫోటోలను ఇంట్లో ఉంచుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి..? చనిపోయిన వారి ఫోటోను ఇంట్లో ఉంచినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
• వాస్తు శాస్త్రం ప్రకారం చనిపోయిన వారి ఫోటోలను ఎప్పుడు గోడకు తగిలించరాదు. ఇలా చనిపోయిన వారి ఫోటోలను గుర్తుగా ఇంట్లో ఉంచుకోవటానికి ఒక చెక్కబల్లపై ఫోటోలను ఉంచుకోవచ్చు.
• అలాగే ఇంట్లోకి రాగానే ఎదురుగా చనిపోయిన వారి ఫోటోలు కనిపించకుండా ఉండేలా ఆ ఫోటోలను ఉంచుకోవాలి.
• కుటుంబంలో మరణించిన వారందరూ ఫోటోలను ఇంట్లో ఉంచుకోవడం అశుభం. అందువల్ల మీకు చాలా ఇష్టమైన ముఖ్యమైన వ్యక్తుల ఫోటోలను మాత్రమే ఇంట్లో ఉంచుకోవాలి.
• అలాగే చాలామంది చనిపోయిన వారి ఫోటోలను దేవుడు గదిలో ఉంచి పూజిస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి ఉంటుంది.
• అలాగే చాలామంది చనిపోయిన వారి ఫోటోలను పడకగదిలో ఉంచుకుంటారు. పొరపాటున కూడా ఇలా ఆ ఫోటోలను పడకగదిలో ఉంచకూడదు.
• చనిపోయిన వారి ఫోటోలను గుర్తుగా ఉంచుకోవాలి అనుకునేవారు ఇంట్లో హాలులో ఉత్తర దిశగా ఫోటోలను ఉంచటం శ్రేయస్కరమని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.