మనలో చాలామంది చిన్నచిన్న విషయాలకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే ఆ చిన్నచిన్న తప్పులే దీర్ఘకాలంలో మనపై ఎంతో ప్రభావం చూపుతాయి. చెప్పులు ఎక్కడ విడచాలనే విషయంలో మనలో కొంతమంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోరు. అయితే చెప్పుల విషయంలో చేసే నిర్లక్ష్యం వల్ల కూడా ఎంతో నష్టపోయే అవకాశం ఉంటుంది. చెప్పులు, షూలను స్టాండ్ లో ఉంచడం మంచిది.
చెప్పులు, షూలను తలక్రిందులుగా ఉంచితే మాత్రం తీవ్రస్థాయిలో నష్టపోయే అవకాశాలు ఉంటాయి. తూర్పు లేదా ఉత్తరం దిక్కులలో చెప్పులను అస్సలు ఉంచకూడదు. ఈ విధంగా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఎవరైతే ఈ విధంగా చెప్పులను ఉంచుతారో ఆ ఇంట్లో ఆర్థికపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు.
దక్షిణ లేదా పడమర దిశలో చెప్పులను ఉంచడం వల్ల శుభ ఫలితాలు కలిగే ఛాన్స్ అయితే ఉంటుంది. గుమ్మానికి ముందు చెప్పులు లేదా బూట్లను ఉంచడం కూడా మంచిది కాదని చెప్పవచ్చు. ఇతరుల చెప్పులు, బూట్లను వాడటం కూడా చేయకూడదు. చెప్పులు, బూట్లు విడవటమే కాదు చెప్పులు కొనడానికి సంబంధించి కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
మధ్యాహ్నం సమయంలో మాత్రమే చెప్పులను కొనుగోలు చేస్తే మంచిదని చెప్పవచ్చు. చెప్పుల సైజు విషయంలో పొరపాట్లు జరిగితే కలిగే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కాళ్లను తరచూ వేర్వేరు అనారోగ్య సమస్యలు వేధిస్తున్నట్టు అయితే చెప్పులను మార్చడం ఉత్తమమని చెప్పవచ్చు. బిగుతు చెప్పులను ధరించడం వల్ల నడక సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.