ఈ మొక్కను ఇంట్లో ఉంచితే దరిద్రం తొలగిపోతుందా.. ఆ సమస్యలు తీరతాయా?

మనలో చాలామందికి మొక్కలు పెంచే అలవాటు అయితే ఉంటుంది. ఈ అలవాటు వల్ల కొంతమందికి పాజిటివ్ గా జరిగితే మరి కొందరికి నెగిటివ్ గా జరుగుతుంది. కొన్ని రకాల మొక్కలు పెంచడం వల్ల శుభ ఫలితాలు కలిగితే కొన్ని రకాల మొక్కలు పెంచడం వల్ల నెగిటివ్ ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈశాన్యం వైపు ప్రహరీ గోడ, మెట్లు ఉంటే నెగిటివ్ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు.

ప్రహరీ గోడ, మెట్ల మధ్య కొంచెం గ్యాప్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. జాడే ప్లాంట్ ను పెంచుకోవడం వల్ల శుభ ఫలితాలను పొందవచ్చు. ఈ మొక్కను పెంచుకోవడం వల్ల శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. కొంతమంది ఈ మొక్కను మోహినీ మొక్క అని కూడా పిలుస్తారు. ఈ మొక్కను పెంచడం ద్వారా వాస్తు పరంగా, ఆరోగ్య పరంగా శుభ ఫలితాలు కలుగుతాయి.

అతి తక్కువ నీటితో కుండీలలో ఈ మొక్కను పెంచే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కొత్త కొత్త మొక్కలు పెంచాలని భావించే వాళ్లు మోహినీ మొక్కపై దృష్టి పెడితే మంచిదని చెప్పవచ్చు. క్రాస్సులా అర్జెంటీ ఈ మొక్క నామం కాగా ఇళ్లు, ఆఫీసుల్లో ఈ మొక్క ఎక్కువగా కనిపిస్తుంది. ఇంట్లోని వేడిని తగ్గించే విషయంలో ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.

పెయింట్ల నుంచి వచ్చే ప్రమాదకరమైన ఆర్గానిక్ కాంపౌండ్స్ ను తొలగించడంలో ఈ మొక్కలు ఉపయోగపడతాయి. ఈ మొక్కల ఆకులతో తయారైన టీ తాగితే డయాబెటిస్ సమస్య దూరమవుతుంది. ఎండ తగిలేలా ఈ మొక్కను పెంచుకుంటే మంచి ఫలితాలు సొంతమవుతాయి. ఇంట్లో లేదా గదిలో ఆగ్నేయ మూలలో లేదా తూర్పు వైపు ఈ మొక్కను ఉంచితే మంచిది. ఇంటికి లక్ ను తెచ్చిపెటడంలో ఈ మొక్క ఉపయోగపడుతుంది.

బెడ్ రూమ్, బాత్ రూమ్ లలో ఈ మొక్కను ఉంచడం మాత్రం కరెక్ట్ కాదు. ఈ మొక్క దొరికితే మాత్రం అస్సలు వదులుకోకుండా ఉంటే మంచిది. ఈ మొక్క వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందే ఛాన్స్ అయితే ఉంటుంటుందని చెప్పవచ్చు. మోహినీ మొక్క వల్ల లాభాలే తప్ప నష్టాలు లేవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.