ఈ పంతులమ్మ బడిలో చిన్న పిల్లాడిపై

విశ్రాంతి సమయంలో అటూ ఇటూ పరిగెడుతున్నాడని ఆ  పంతులమ్మకు సుర్రుమన్నదట. అంతే చిన్న పిల్లాడు అని కూడా చూడకుండా ఆ పిల్లవాని పై కర్రనెత్తింది.  ఇష్టమొచ్చినట్టు కొట్టింది. కడప జిల్లా కేంద్రంలోని  ప్రైవేటు పాఠశాలలో షేక్ మహ్మద్ అల్తాఫ్ అనే విద్యార్ధి 2వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం పాఠశాల ఇంటర్ బెల్ సమయంలో పిల్లవాడు అటూ ఇటూ పరిగెత్తుతున్నాడు. ఆ పిల్లవాడు పరిగెడితే పంతులమ్మకు సుర్రుమన్నదట. అంతే ఆ పంతులమ్మ ఆ పిల్లగాని కాడికి పోయి కట్టెతోటి  వాతలు పడేలాగా కొట్టింది.

విషయం తెలుసుకున్న విద్యార్ధి తండ్రి దస్తగిరి పాఠశాల హెడ్ మాస్టర్ ని నిలదీయగా  టిచర్ చేసింది తప్పేనని టిచర్ ను సస్పెండ్ చేస్తున్నామని రాతపూర్వకంగా  దస్తగిరికి లెటర్ రాసి ఇచ్చారు. పిల్లలు అల్లరి చేయడం, ఆటలాడటం సహజమని దానికే ఇంత ఘోరంగా కొట్టడం సరైంది కాదని ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళతానని దస్తగిరి అన్నారు.