కేవలం 84 రూపాయలు చెల్లిస్తే ఏకంగా 42 వేల రూపాయలు పొందే ఛాన్స్.. ఏం చేయాలంటే?

ప్రస్తుతం దేశంలో రైతు కుటుంబాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. రైతులకు మేలు చేసేలా కేంద్రం ఎన్నో పథకాలను అమలు చేస్తుండగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్స్ లో పిఎం ఎఫ్‌బీవై కింద అమలు చేస్తున్న ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ఒకటి. ఎకరా పంటకు కనిష్టంగా 42 రూపాయల నుంచి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పంటలను బట్టి ప్రీమియంలలో మార్పులు ఉంటాయని చెప్పవచ్చు.

చాలామంది బ్యాంక్ లో పాస్ బుక్ లను పెట్టి లోన్ తీసుకుంటూ ఉంటారు. అలా రుణం తీసుకున్న వాళ్లు బ్యాంకు ద్వారానే ప్రీమియం చెల్లించి బీమా పొందే అవకాశం ఉంటుంది. నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్ ద్వారా లేదా కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా బీమా చెల్లించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పట్టాదార్ పాస్ బుక్, బ్యాంక్ అకౌంట్, ఆధార్ జిరాక్స్, పంట సాగు వివరాలను జతపరచడం ద్వారా ఈ బెనిఫిట్స్ పొందవచ్చు.

ఏవైనా కారణాల వల్ల పంటకు సంబంధించి ఇబ్బందులు ఎదురైతే మాత్రం సులువుగా పంట బీమా పొందే అవకాశాలు ఉంటాయి. రైతులకు ఈ స్కీమ్ ఒక విధంగా వరం అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయంపైనే ఆధారపడిన రైతులు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను సులువుగా పొందవచ్చు. ఒక విధంగా క్రాప్ ఇన్సూరెన్స్ అనేది రైతులకు వరం అవుతుందని చెప్పవచ్చు.

అయితే బీమా తీసుకునే వాళ్లు అన్ని విషయాలను పూర్తిగా తెలుసుకుని మాత్రమే పంటల బీమాపై దృష్టి పెడితే మంచిది. షరతుల గురించి తెలుసుకుని మాత్రమే పంటల బీమాపై దృష్టి పెడితే మంచిదని చెప్పవచ్చు.