మెడ నొప్పి సమస్యతో బాధ పడుతున్నారా.. ఈ సమస్యకు చెక్ పెట్టే క్రేజీ చిట్కాలివే!

ప్రస్తుత కాలంలో చాలామందిని మెడనొప్పి సమస్య వేధిస్తోంది. ఈ సమస్య చిన్న సమస్యలా అనిపించినా ఈ సమస్య వల్ల నరకం అనుభవిస్తున్నామని చాలామంది చెబుతుంటారు. మెడ నొప్పి సమస్యతో బాధ పడేవాళ్లు ఫోన్ వాడకాన్ని వీలైనంత తగ్గిస్తే మంచిది. ఫోన్లు ఎక్కువగా వాడటం వల్ల మెడ పట్టుకునే అవకాశాలు అయితే ఉంటాయి. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చునే వాళ్లను సైతం ఈ సమస్య వేధిస్తుంది.

కనీసం ప్రతి గంటకు ఒకసారి సిస్టమ్ ముందు నుంచి లేవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. కంప్యూటర్, ల్యాప్ టాప్ లను సమాన ఎత్తులో ఉంచడం ద్వారా కూడా ఈ సమస్య దూరమవుతుందని చెప్పవచ్చు. కంప్యూటర్ ముందు నిటారుగా కూర్చోవడం ద్వారా కూడా ఈ సమస్య దూరమయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకే భంగిమలో పడుకోవడం, కూర్చోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు.

నిద్రపోయే సమయంలో తక్కువ ఎత్తు ఉన్న దిండు వాడటం ద్వారా కూడా ఈ సమస్య దూరమవుతుంది. వ్యాయామాలు ఎక్కువగా చేసేవాళ్లు మెడపై ఎక్కువ సమయం పాటు ఒత్తిడి పడకుండా వ్యాయామాలు చేయడం మంచిది. సుదీర్ఘంగా మెడ నొప్పి ఉంటే మాత్రం వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిది. మెడ నొప్పి సమస్య విషయంలో నిర్లక్ష్యం వహించడం మంచిది కాదు.

మెడ నొప్పి మరీ తీవ్రంగా ఉంటే కొన్ని క్రీమ్స్ ను వాడటం ద్వారా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. మెడ నొప్పి వల్ల దీర్ఘకాలంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మెడ నొప్పి సమస్యతో బాద పడేవాళ్లు ఈ చిట్కాలను కచ్చితంగా పాటిస్తే మంచిదని చెప్పవచ్చు.