Roja: షర్మిల నీకు తెలుగు.. ఇంగ్లీష్ అర్థం కాదా… షర్మిలకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన రోజా?

Roja: వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా సౌర విద్యుత్ కోసం సెకీతో చేసుకున్న ఒప్పందం వివాదాస్పదమైన నేపథ్యంలో జగన్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అత్యంత తక్కువ ధరకే తాము సెకీతో ఒప్పందం చేసుకున్నామే తప్ప అదానీతో ఎలాంటి ఒప్పందాలు లేవని, తన పేరు ఎస్బిఐ చార్జిషీట్లో కూడా లేదని కొంతమంది వారి స్వార్థపూరిత రాజకీయాల కోసం తన పేరును కనుక ప్రస్తావిస్తే తప్పనిసరిగా తాను వంద కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తానని క్లారిటీగా చెప్పారు.

ఇలా అదానీ నుంచి జగన్ ముడుపులు తీసుకున్నారంటూ వస్తున్న ఈ వ్యవహారంపై జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ విషయం గురించి అందరికీ అర్థమయ్యేలా స్పష్టత ఇచ్చారు. అయినప్పటికీ వైయస్ షర్మిల తిరిగి అన్నపై విమర్శలు మొదలుపెట్టేశారు. వీటికి వైసీపీ నేత రోజా ఘాటు కౌంటర్ ఇచ్చారు.

ఈ సందర్భంగా రోజా ఈ విషయంపై స్పందిస్తూ.. షర్మిల గారూ మీకు ఇంగ్లీష్ అర్థం కాదా? లేకపోతే తెలుగు అర్థం కాదా? నిన్న మీ అన్నగారు సెకీతో విద్యుత్ ఒప్పందం చేసుకున్న విషయాలన్నింటిని ఆధారాలతో సహా రెండు భాషలలో చాలా స్పష్టంగా వివరించారు. ఇలా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పటికీ మీరు మాత్రం ఆంధ్రజ్యోతిలో రాసిన పాయింట్లు పట్టుకొని ఒక వితండవాదంతో జగన్ గారి పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ ట్వీట్ చేసారు.

2021లో మే నెలలో సెకీ ఎక్కడ వేలం వేసింది? 2.14 పైసలకు ఎక్కడ అమ్మిందంటూ షర్మిల చేసిన వ్యాఖ్యల్ని ప్రశ్నించారు.అదానీ వద్ద గుజరాత్ కరెంటు కొనలేదని, గుజరాత్ ప్రభుత్వ విద్యుత్ కంపెనీ GUVNL అదే గుజరాత్‌లోని డిస్కంల నుంచి కొనుగోలు చేశాయని రోజా గుర్తుచేశారు. ఇలా జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన పరువు ప్రతిష్టలను దిగజార్చేల షర్మిల మాట్లాడటంతో రోజా ఘాటుగా స్పందిస్తూ షర్మిలకు కౌంటర్ వేశారు.