హరీష్ శంకర్ ఐడియా పెద్ద ప్లస్ అయింది.. పుష్ప పోస్టర్ గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ!

పుష్ప 1 రిలీజ్ అయిన తర్వాత అది ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ పుష్ప సినిమాకి ఫాన్స్ అయిపోయారు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం తగ్గేదే లేదు అంటూ గడ్డం కింద చేయి పెట్టి పుష్ప సిగ్నేచర్ స్టైల్ ని చూపించారు. ఇప్పుడు దేశమంతా పుష్ప 2 కోసం ఎదురుచూస్తుంది. అన్ని కళ్ళు ఆ సినిమా పైనే ఉన్నాయి. అయితే ఈ సినిమా ప్రమోషన్లు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి.

ట్రైలర్ ఈవెంట్ ని పాట్నాలో పెట్టి అది గ్రాండ్ సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు ప్రమోషన్ల భాగంగా ముంబైకి వచ్చారు చిత్రం బృందం. ఈవెంట్లో అల్లు అర్జున్, రష్మిక మందన్నలు పాల్గొన్నారు. ప్రమోషన్లలో భాగంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ఇప్పుడంటే పుష్ప 2 క్రేస్ పెరిగింది కానీ పుష్ప సమయంలో సినిమా టైటిల్ రిలీజ్ చేద్దాం అనుకున్నప్పుడు చాలా సాఫ్ట్ గా ఉంది అనుకున్నాము.

కానీ సుకుమార్ కి, నాకు మంచి ఫ్రెండ్ అయిన డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమా టైటిల్ ని చూసి పేరు సాఫ్ట్ గా ఉంది కాబట్టి రఫ్ గా ఉన్న ఫస్ట్ లుక్ పోస్ట్ చేస్తే రెండు బ్యాలెన్స్ అయిపోతాయి అన్నారు. ఐడియా బాగుందని అలాగే రఫ్ లుక్ లో ఉన్న పోస్టర్ని రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది అన్నారు అల్లు అర్జున్.

ఇప్పుడు పుష్ప 2 కి ఫస్ట్ లుక్ ఎలా ఉంటుంది అని అందరూ ఎంతగానో ఎదురు చూడగా ఎవరి అంచనాలనికి అందనంత విధంగా లేడీ గెటప్ లో అల్లు అర్జున్ చూపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు సుకుమార్. దీని గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ సుకుమార్ లేనిదే నేను స్టార్ అయ్యే వాడినే కాదు అంటూ తనకి ధన్యవాదాలు చెప్పుకొచ్చారు.