YS Jagan: టీడీపీని సింగిల్ డిజిట్ కు పరిమితం చేయాలి… కష్టమొస్తే నన్ను గుర్తు చేసుకోండి: జగన్

YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి పరాజయం కావడంతో తరచూ ప్రెస్ మీట్ కార్యక్రమాలను నిర్వహించడం అలాగే వైకాపా నేతలతో సభలు సమావేశాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు జగన్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

రాష్ట్రవ్యాప్తంగా రెడ్ బుక్ పాలన కొనసాగుతుందని తెలిపారు. వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయాయని వెల్లడించారు. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేకపోయారని ఈ విషయంలో ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకత చూపుతున్నారని తెలిపారు. మన ప్రభుత్వ హయామంలో ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి నిలబెట్టుకున్నాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా మరి కాస్త ఎక్కువ పథకాలను ప్రకటించడంతో ఈయన కూడా మన మాదిరిగానే ఇస్తారని భావించి ఓట్లు వేశారని కానీ ప్రజల నమ్మకాన్ని చంద్రబాబు ఒమ్ము చేశారని జగన్ తెలిపారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా మన పార్టీ నేతలపైన కార్యకర్తల పైన అక్రమంగా కేసులు పెట్టే అరెస్టులు చేస్తున్నారు. ఏదైనా ఒక పోస్ట్ చేయాలన్నా కూడా నేడు కార్యకర్తలు భయపడాల్సిన పరిస్థితికి వచ్చిందని అంతలా వ్యవస్థలన్నింటినీ కూటమి ప్రభుత్వం నాశనం చేస్తుందని జగన్ మండిపడ్డారు. ఇక మనం ఓడిపోయినప్పుడు తప్పనిసరిగా కష్టాలు ఉంటాయి. అయితే ఆ కష్టాలన్నీటిని ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే విజయం వరిస్తుందని తెలిపారు..

మీకు కష్టం వస్తే ఒక్కసారి నన్ను తలుచుకోండి అంటూ జగన్ తెలిపారు. తనని ఎలాంటి బెయిల్ లేకుండా 16 నెలల పాటు జైలులో బంధించారు. ఆ సమయంలో నేను ఎలాంటి కష్టాలను భరించి వాటిని ఎదుర్కొని బయటకు వచ్చాననే విషయాలను గుర్తు చేసుకుంటే ఏ కష్టం పెద్దది కాదని తెలిపారు.గతంలో వైసీపీకి 151 స్థానాలు వచ్చాయి.. కానీ, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి సింగిల్ డిజిట్ కి పరిమితం చేయాలని సూచించారు.