హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. నాసిక్ లోని ఈ సంస్థ నాలుగేళ్ల ఒప్పంద ప్రాతిపదికన నాన్ ఎగ్జిక్యూటిక్ కేడర్ లో ఆపరేటర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను కోరుతోంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. డిసెంబర్ నెల 9వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది.
2024 సంవత్సరం నవంబర్ 21 నాటికి 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదు సంవత్సరాలు, ఓబీసీలకు మూడు సంవత్సరాలు, దివ్యాంగులకు పది సంవత్సరాలు వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి. డిప్లొమా టెక్నీషియన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, పెయింటర్, టర్నర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
పెయింటర్, టర్నర్ ఉద్యోగ ఖాళీలకు కూడా అర్హత ఉన్నవాళ్లు సులువుగా దరఖాస్తు చేసుకోవచ్చు. డిప్లొమా ఆపరేటర్ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 23000 వేతనం లభించనుండగా ఐటీఐ ఆపరేటర్ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 22000 రూపాయల వేతనం లభించనుంది. రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఇందుకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్ నెల 28వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా డిసెంబర్ నెల 9వ తేదీ ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీగా ఉండనుంది. 2024 సంవత్సరం డిసెంబర్ 22వ తేదీన ఇందుకు సంబంధించిన రాతపరీక్షను నిర్వహించనున్నారు.