KTR: రాజకీయాలకు బ్రేక్ ఇచ్చిన కేటీఆర్… సంచలనగా మారిన ట్వీట్!

KTR: తెలంగాణ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈయన రాజకీయాలకు చిన్న బ్రేక్ ఇస్తూ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. గత కొంతకాలంగా ప్రతిపక్ష నేతగా రాజకీయాలలో ఎంతో బిజీగా ఉంటూ ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయితే కొంతకాలం పాటు తనకు విశ్రాంతి అవసరమని భావించిన కేటీఆర్ రాజకీయాలకు చిన్న బ్రేక్ ఇచ్చారని తెలుస్తుంది.

ఇక ఇదే విషయాన్ని ఈయన సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ట్వీట్ చేశారు. నేను రాజకీయాల పరంగా రీ ఫ్రెష్ కావాలనుకుంటున్నాను అందుకే కొద్దిరోజుల పాటు నా కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాను నా ప్రత్యర్థులు నన్ను మర్చిపోరని ఆశిస్తున్నాను అంటూ ఈ సందర్భంగా కేటీఆర్ తన రాజకీయాలకు చిన్నవిరామం ప్రకటిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.

ఇకపోతే నవంబర్ 29వ తేదీ నాటికి సరిగ్గా 15 సంవత్సరాల క్రితం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ తెలంగాణ కోసం పోరాటం చేశారని బిఆర్ఎస్ నేతలు దీక్ష దివస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తెలంగాణ భవన్లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం పోరాటం చేస్తూ ప్రజా ఉద్యమం ద్వారా తెలంగాణని సంపాదించింది కేసీఆర్ అంటూ చెప్పుకోవచ్చారు.

సోనియా గాంధీ భిక్ష వల్లే తెలంగాణ వచ్చిందని..రాష్ట్ర ఆత్మగౌరవాన్ని, తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాల్ని సీఎం రేవంత్ రెడ్డి కించపరుస్తున్నాడని ఆగ్రహించారు కేటీఆర్. ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడాది కాలం పూర్తి కావడంతో ఈయన తెలంగాణ వ్యాప్తంగా విజయోత్సవాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.