సాధారణంగా చలికాలంలో ఆస్తమా వ్యాధితో బాధ పడే వాళ్లు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చలికాలంలో ఆస్తమా వ్యాధిగ్రస్తులను ఎన్నో సమస్యలు వేధిస్తాయని చెప్పవచ్చు. ఆస్తమా, ఇన్ఫెక్షన్స్, హృదయ సంబంధిత సమస్యల వల్ల చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. డయాబెటిస్, ఒబిసిటీ, వృద్ధులు, రెస్పిరేటరీ సమస్యలు ఉన్నవాళ్లకు ఈ సమస్య వస్తే మరింత ప్రమాదకరం అని చెప్పవచ్చు.
చలికాలంలో బీపీ వల్ల చెమట బయటకు రాకపోవడంతో కూడా ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంటుంది. అయితే కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. రెండు గ్లాసుల నీటిలో ఒక టేబుల్ స్పూన్ వాము, 10 పుదీనా ఆకులు, రెండు కర్పూరం బిళ్ళలు వేసి ఆ నీటిని బాగా మరిగించి ఆ ఆవిరిని కొంత సమయం పాటు ముక్కుతో కొంత సమయం పాటు నోటితో పీల్చడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.
వాము పొడిని ఒక గుడ్డలో కట్టి మెల్లగా వాసన చూస్తే కూడా ఈ సమస్య దూరమయ్యే అవకాశాలు ఉంటాయి. వాము, బెల్లం కలిపి తీసుకోవడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందవచ్చు. చలికాలంలో ఎక్కువగా బయటకు తిరగకుండా ఉండటం ద్వారా ఈ సమస్యను కొంతమేర అధిగమించవచ్చు. స్వెట్టర్లు , స్కార్ప్ , టోపీలు, గ్లౌజులు, సాక్స్ లను ధరించడం ద్వారా కొంతవరకు ఈ సమస్యను అధిగమించవచ్చు.
జలుబు, గొంతు నొప్పి సమస్యలు ఉన్నవాళ్లు ఆవిరి పట్టడం ద్వారా సమస్యకు చెక్ పెట్టవచ్చు. వెచ్చని నీటిలో ఉప్పు కలుపుకొని పుక్కిలించడం ద్వారా సమస్య దూరమవుతుంది. తరచూ వేడి నీటిని తాగడం ద్వారా కూడా ఈ సమస్యను అధిగమించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.