ప్రస్తుత కాలంలో జీవనశైలిలో మార్పుల వల్ల చాలామందిని చిన్న వయస్సులోనే వేర్వేరు ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. అధిక రక్తపోటు వల్ల చాలామంది నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తలనొప్పి, జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులతో బాధ పడేవాళ్లలో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తోంది. కిడ్నీ ఫెయిల్యూర్, థైరాయిడ్, ఆర్థో సమస్యలతో పాటు మధుమేహం, పక్షవాతంతో బాధ పడేవాళ్లు ఎక్కువగా ఈ సమస్యతో బాధ పడుతున్నారని తెలుస్తోంది.
ఎక్కువగా ఉప్పు ఉన్న ఆహారాలను తీసుకునే వాళ్లను రక్తపోటు మరింత త్వరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమంది ట్రాఫిక్ టెన్షన్ వల్ల కూడా హైపర్ టెన్షన్ బారిన పడుతున్నారని సమాచారం అందుతోంది. మార్కెట్ ఫీల్డ్, మెడికల్ రిప్రజెంటేటివ్స్, సేల్స్‌మెన్, డ్రైవర్స్ ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అధిక రక్తపోటు గుండె, ఊపిరితిత్తులు, మెదడు, కిడ్నీలపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతుంది.
కూరగాయలు, పండ్లు, నట్స్, తృణధాన్యాలు, ప్రొటీన్, చేపల ద్వారా రక్తపోటుకు చెక్ పెట్టవచ్చు. గుండె దడ, తికమక పడటం, నిద్రలేమి, చూపు మసకభారతం, విపరీతమైన అలసట, చెవుల్లో రింగుమని శబ్దాలు రావడం, శ్వానతీనుకోవడంలో ఇబ్బంది, తలనొప్పి బీపీ లక్షణాలు అని చెప్పవచ్చు. ఈ సమస్య వల్ల మెదడులో రక్త నాళాలు చిట్లిపోయి పక్షవాతం బారిన పడే ఛాన్స్ ఉంటుంది.
ట్రాన్స్ ఫ్యాట్స్, రెడ్ మీట్, ప్రాసెస్డ్, రిఫైన్డ్ కార్బొహైడ్రేట్లు, చక్కెర పానీయాలకు దూరంగా ఉంటే ఆరోగ్యానికి మంచిది. ఇవి ఎక్కువగా తీసుకునే వాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. ఆరోగ్యంగా ఉన్నవారు రోజుకు 5 గ్రాముల ఉప్పు తీసుకోవాలి. దుంప కూరలను వాడటం ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్పవచ్చు. గానుగ పట్టిన నూనెలను తెచ్చుకుని వాడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.