మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో అప్పు చేస్తూ ఉంటారు. అయితే అప్పులు ఎక్కువగా చేయడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. చాలామంది వాళ్ల అవసరాలను తీర్చుకోవడం కోసం అప్పులు చేస్తూ ఉంటారు. అయితే తీసుకున్న రుణాన్ని తీర్చాలంటే చాలా సమయం పడుతుందని కచ్చితంగా చెప్పవచ్చు. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా అప్పులను సులువుగా తీర్చే ఛాన్స్ అయితే ఉంటుంది.
త్వరగా రుణాన్ని చెల్లించాలనుకుంటే మొదట ఆదాయాన్ని పెంచుకోవాలి. లోన్ వాయిదాలను కొన్ని నెలలు ఆపి ఒకేసారి ఎక్కువ మొత్తం చెల్లించడం ద్వారా రుణాలను నెమ్మదిగా తగ్గించవచ్చు. తక్కువ వడ్డీ రుణాన్ని తీసుకోవడం ద్వారా బకాయిలను సులువుగా చెల్లించే ఛాన్స్ అయితే ఉంటుంది. క్రెడిట్ కార్డ్ బిల్లుల రూపంలో అప్పు ఎక్కువగా ఉంటే వాటిని ఈఎంఐలుగా మార్చితే మంచిది.
జీవిత బీమా పాలసీ లేదా ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా రుణాన్ని తిరిగి చెల్లించడం సాధ్యమవుతుంది. వారసత్వంగా వచ్చిన డబ్బు, ఆస్తి తనఖా వంటి మార్గాలు కూడా మీ లోన్ చెల్లింపులకు సులువుగా ఉపయోగపడతాయని చెప్పవచ్చు. ఈ మార్గాల ద్వారా వచ్చిన నగదుతో మిమ్మల్ని మీరు అప్పు లేకుండా మార్చుకునే ఛాన్స్ ఉంటుంది.
అప్పులు తీర్చిన తర్వాత క్రెడిట్ కార్డును స్వైప్ చేయడం తగ్గించాలి. బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా ఉందో అనేది మీరు సులభంగా ఈ విధానం ద్వారా తెలుసుకోవచ్చు. ఎక్కువ వడ్డీకి అప్పులు తీసుకుంటే మాత్రం ఏదో ఒక సందర్భంలో ఇబ్బందులు పడాల్సి ఉంటుందని కచ్చితంగా చెప్పవచ్చు. అప్పులు ఎక్కువగా చేసేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.